అప్పుడే మ్యూజిక్ కోసం కష్టాలు

మహేష్ కెరీర్ లో 25 వ చిత్రాన్ని వంశి పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి వంశి దర్శకత్వం వహిస్తుండగా... దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కొరటాల దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న 'భరత్ అనే నేను' సినిమా పూర్తి కాగానే వంశీ పైడిపల్లి సినిమాకి షిప్ట్ అవుతాడు మహేష్. ఇక 'భరత్ అనే నేను' సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక కొరటాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్ అనే నేను' సినిమాకి కూడా దేవీశ్రీ మ్యూజిక్ డైరెక్టర్.
ఇక 'భరత్ అనే నేను' మ్యూజిక్ సంగతి ఎలా ఉన్న ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్.. వంశి దర్శకత్వంలో తెరకెక్కబోయే మహేష్ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం అమెరికా వెళ్ళాడు. అక్కడ దర్శకుడు వంశి పైడిపల్లి, దేవిశ్రీ ప్రసాదులు న్యూయార్క్ వీధుల్లో హల్చల్ చేస్తూ... అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణంలో.. ఓపెన్ ఏరియాలో మ్యూజిక్ సిట్టింగ్స్ పెట్టుకున్నారు. ఇదే విషయాన్నీ దేవిశ్రీ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మరి చెప్పాడు. ఆ ఫొటోస్ తో పాటే..... మహేష్ 25వ సినిమా కోసమే ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ అంటూ వివరణ కూడా ఇచ్చేసాడు.
అంతే కాకుండా మహేష్ 25 సినిమా స్క్రిప్ట్ అద్భుతం, ఇన్స్పైరింగ్.... ఈ సినిమా అందరికి నచ్చుతుంది అని కూడా ట్వీట్ చేసి ఈ సినిమాపై అంచనాలు పెంచేసాడు. అయితే మహేష్ బాబు - వంశి చిత్రానికి టైటిల్స్ గా 'కృష్ణ ముకుందా మురారి' గానీ.... 'హరే రామ హరే కృష్ణ' గానీ పెడుతున్నారని టాక్ వినబడింది. కానీ ఆ రెండు టైటిల్ లో ఏ టైటిల్ కూడా మహేష్ సినిమాకి పెట్టడం లేదని... మా సినిమాకి ఏ టైటిల్ పెడుతున్నామో అనేది నిర్ణయించాక మేమె అధికారికంగా విడుదల చేస్తామని మహేష్ 25 సినిమా డైరెక్టర్ వంశి చెబుతున్నాడు.

