అప్పుడు శ్రియ భయపడితే ఇప్పుడు కైరా భయపడిందన్నమాట!!

తెలుగు ఇండస్ట్రీలో బాలకృష్ణ అంటే కాస్తా డేరింగ్ స్వభావం అని చాలా మంది అభిప్రాయం, ఆయన సినిమా కోసం ఎంత కష్టం పేస్ చేయడానికి అయిన రెడీ అని అందరు చెప్పే మాట. బాలకృష్ణ యాక్షన్‌సీన్స్‌లో డూప్లకి అవకాశం ఇవ్వకుండా తానే ఎంత రిస్క్ షాట్ అయినా చేస్తాడు. 'లెజెండ్'లో ఆయన చేసిన యాక్షన్ సీన్స్‌కి, 'గౌతమీపుత్రశాతకర్ణి' చిత్రంలో గుర్రపు స్వారీ నుంచి కత్తి యుద్దాల వరకు తానే చేశాడు. తాజాగా బాలయ్య, పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో తన 101 వ చిత్రంగా 'పైసా వసూల్' చేస్తున్నాడు. సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది.
సినిమాలో ఓ కీలకమైన ఫైట్ సీన్ ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ ఫైట్ లో బాలయ్య తన మార్క్ కనిపించేలా యాక్షన్ చేస్తున్నారంట. ఇక బాలకృష్ణ సొంతంగా భారీ యాక్షన్ సీన్స్ చేశాడని... ఇందులో నటిస్తున్న కైరాదత్ బాలయ్యను పొగడ్తలతో ముంచెత్తింది. ఈ యాక్షన్ సీన్‌ని చూసిన ఆమె ఇలా రియల్‌గా సాహసోపేతమైన రియల్ యాక్షన్ హీరోని ఇంతవరకు చూడలేదని ఆశ్యర్యానికి లోనైంది. ఈ వయసులో కూడా బాలయ్య చేస్తున్న రియల్ యాక్షన్సీన్స్ని చూసి తన నోట మాటరాలేదని తెలిపింది.
అయితే ఇదివరకే బాలయ్య పోర్చుగల్ షెడ్యూల్లో కూడా ఓ కారు ఛేజింగ్యాక్షన్సీన్ని స్వయంగా చేశాడట. అది చూసిన శ్రీయ శరణ్ కూడా ఇప్పుడు కైరా దత్ లాగే ఆశ్చర్యపోయిన సంగతి తెలిసిందే. మరి అప్పుడు శ్రియ ని భయపెట్టిన బాలయ్య ఇప్పుడు కైరా ని కూడా భయపెట్టాడన్నమాట. ఇక ఈ చిత్రంలో శ్రియాశరన్‌తో పాటు ముస్కాన్ అనే కొత్తనటి హీరోయిన్గా పరిచయం అవుతుండగా, కైరాదత్ ఓ ఐటం సాంగ్‌తో పాటు కొన్ని సీన్స్‌లో నటించే పాత్రను చేస్తోంది.

