అప్పుడు విభేదాలన్నారు.. కానీ ఇప్పుడు!!
నాని ఎంసీఏ సినిమా చేస్తున్న టైం లో హీరోయిన్ సాయి పల్లవికి నాని కి మధ్యన ఏవో విభేదాలొచ్చాయని వాటిని నిర్మాత దిల్ రాజు సెటిల్ చేసి [more]
నాని ఎంసీఏ సినిమా చేస్తున్న టైం లో హీరోయిన్ సాయి పల్లవికి నాని కి మధ్యన ఏవో విభేదాలొచ్చాయని వాటిని నిర్మాత దిల్ రాజు సెటిల్ చేసి [more]

నాని ఎంసీఏ సినిమా చేస్తున్న టైం లో హీరోయిన్ సాయి పల్లవికి నాని కి మధ్యన ఏవో విభేదాలొచ్చాయని వాటిని నిర్మాత దిల్ రాజు సెటిల్ చేసి ఇద్దరికి ప్యాచప్ చేసాడనే న్యూస్ బాగా ప్రచారం జరిగింది. అందులోనే ఎంసీఏ సినిమాలో సాయి పల్లవి పాత్ర కి ప్రాధాన్యత తగ్గించారని ఆమె అలిగినట్లుగా.. ఇక తర్వత ఫ్యూచర్ లో నాని తో సాయి పల్లవి నటించే అవకాశం లేదని కూడా అన్నారు. కానీ తాజాగా నాని తో సాయి పల్లవి మరోసారి జోడి కట్టబోతుంది అనే న్యూస్ మొదలైంది. ప్రస్తుతం వి.. ద మూవీ లో విలన్ రోల్ చేస్తున్న నాని, శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ సినిమా మొదలెట్టాడు.
ఆ సినిమా పూర్తి కాగానే నాని టాక్సీవాలా దర్శకుడు రాహుల్ సంక్రిత్యాన్తో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే న్యూస్ నడుస్తుంది. వి, టక్ జగదీశ్ సినిమాలు పూర్తయ్యేసరికి రాహుల్ సంక్రిత్యాన్ నాని సినిమా స్క్రిట్ లాక్ చేసుకుని.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో పాటుగా నటుల ఎంపిక చేపడతాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ముందు బాలీవుడ్ హీరోయిన్ తీసుకురావాలని అనుకున్నప్పటికీ… వారు మరీ పారితోషకాల విషయంలో కాస్త గట్టిగా ఉండడంతో.. కాస్త క్రేజ్ ఉన్న హీరోయిన్ తో సరిపెడదామని సాయి పల్లవి ని నాని తో మరోసారి నటింప చెయ్యాలను అనుకుంటున్నారట. సాయి పల్లవి నాని సినిమాకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని.. అంటున్నారు. మరి ఎంసీఏ సినిమా అపుడు నాని – సాయి పల్లవి మధ్యన ఏం జరిగిందో కానీ.. ప్రస్తుతం అయితే సాయి పల్లవి మాత్రం నాని సినిమా ఒప్పేసుకుంది అంటున్నారు.

