అప్పుడు తండ్రి... ఇప్పుడు కూతురు!

మొన్నామధ్యన తల్లిని కోల్పోయిన బాధలో కారు రాష్ గా డ్రైవ్ చేసి వేరే వ్యక్తి కారుని గుద్దిన విషయంలో రాజశేఖర్ కాస్త ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు కలగజేసుకుని ఈ విషయాన్నీ పెద్దది కాకుండా రాజి కుదర్చడంతో విషయం సద్దుమణిగింది. రాజశేఖర్ తన తల్లి మరణంతో తీరని దుఃఖం తో స్లీపింగ్ పిల్స్ మింగి మితిమీరిన వేగంతో కారు డ్రైవ్ చేసి ఎదుటి కారును గుద్దగా... అతను రాజశేఖర్ మద్యం తాగి డ్రయివ్ చేస్తూ తన కారును గుద్దాడని నానా రచ్చ చేసాడు. కానీ ఈ విషయంలో జీవిత తెలివిగా వ్యవహరించి ఈ సమస్య పెద్దది కాకుండా చూసింది. అయినా మీడియాలో మాత్రం బాగా ప్రచారం జరిగింది.
ఇంకా ఆ విషయం మరువకముందే రాజేశేఖర్ కూతురు శివాని గత రాత్రి కారు యాక్సిడెంట్ చేసింది. ప్రస్తుతం రాజశేఖర్ పి ఎస్ వి గరుడావెగా విజయంతో కుటుంభం సభ్యులు సంబరాల్లో మునిగితేలుతున్న వేళ నిన్న శనివారం రాత్రి ఆయన పెద్ద కూతురు శివాని కారు జూబ్లీహిల్స్ దగ్గర అదుపు తప్పి ఆగి ఉన్న కారును ఢీ కొట్టినట్లుగా చెబుతున్నారు. ఆగి ఉన్న కారులో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని...కానీ శివాని ఢీ కొట్టిన కారు ఒక ఉన్నత కుటుంబానికి చెందిన కారు కావడంతో.. వారు తమ కారుకి నష్టపరిహారం చెల్లించమని గొడవ మొదలు పెట్టారట.
వారు తమ కారును ఈమధ్యనే కొన్నామని... కారుకి యాక్సిడెంట్ చేసినందుకు గాను 30 లక్షలు చెల్లించమని గొడవ చేస్తున్నట్టుగా సమాచారం. అలాగే ఈ విషయం పోలీస్ లు దగ్గరికి వెళ్లినప్పటికీ రెండు కుటుంబాల వారు పెద్ద వారు కావడంతో ఆచి తూచిఅడుగులు వెస్తూ కేసు కాకుండానే సెటిల్మెంట్ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న శివాని త్వరలోనే సినీరంగ ప్రవేశం చేయబోతుంది. ఇలాంటి టైం లో ఇలా యాక్సిడెంట్ కేసులో ఇరుక్కోవడంతో రాజశేఖర్ దంపతులకు ఏం పాలుపోవడంలేదని.. ఈ విషయం పెద్దది కాకూండా చూస్తున్నట్టుగా చెబుతున్నారు.

