అప్పుడు కుదరక ఇప్పుడు వెళుతున్నాడు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొన్నటివరకు జై లవ కుశ సినిమా షూటింగ్ తోనూ, బుల్లితెర మీద బిగ్ బాస్ రియాలిటీ షోకి హోస్ట్ గాను తీరక లేకుండా గడిపాడు. ఇక జై లవ కుశ తో కమర్షియల్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ అటు బుల్లితెర మీద కూడా బిగ్ బాస్ వ్యాఖ్యాతగా మంచి పేరు కొట్టేసాడు. అయితే జై లవ కుశ, బిగ్ బాస్ రెండు ఒకేసారి పూర్తికావడంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా ఫ్రీ అయ్యాడు. జై లవ కుశ తర్వాత ఎన్టీయార్, త్రివిక్రమ్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాకి ముహూర్తం కూడా పెట్టించుకుని ఎన్టీఆర్ యూరప్ ట్రిక్ కి వెళ్లాల్సి ఉంది.
అయితే ఎన్టీఆర్ కున్న చిన్న పనులు, అలాగే ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్ వీసా పనులు లేట్ కావడంతో ఎన్టీఆర్ ఇప్పటి వరకు యూరప్ ట్రిప్ కి వెళ్ళకుండా ఉండిపోయాడు. ఇక ఎలాగూ త్రివిక్రమ్ తో సినిమా ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకెళుతుంది.. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ తో కలిసి చెయ్యబోయే మల్టీస్టారర్ కూడా మార్చ్ లేదా ఏప్రిల్ నుండి మొదలయ్యే అవకాశం ఉండడంతో... ఈ లోపు ఎన్టీఆర్ భార్య ప్రణతి, కొడుకు అభయ్ రామ్ తో కలిసి యూరప్ ట్రిప్ కి సిద్దమయ్యాడు.
ఇక తాను కమిట్ అయిన సినిమాలు మొదలవ్వడానికి ఇంకా చాలా టైం ఉండడం తో ఇప్పుడు ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చెయ్యబోతున్నాడు.

