అన్ని మైండ్ బ్లోయింగ్స్ అంట

మహేష్ - మురుగదాస్ కలయికలో తెరకెక్కిన స్పైడర్ చిత్రం విడుదలకు కేవలం ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. స్పైడర్ పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుసు. మొదటిసారి మహేష్ - మురుగదాస్ కలయికలో సినిమా తెరకెక్కడంతోనే సినిమాపై పిచ్చ అంచనాలు పెరిగిపోయాయి. స్పైడర్ టీజర్స్, ట్రైలర్ తోనూ బాగానే ఆకట్టుకుంది. ఇక డిస్ట్రిబ్యూటర్స్ అయితే స్పైడర్ మీద ఎటువంటి అనుమానాలు పెట్టుకోకుండానే కళ్ళు మూసుకుని మరీ ఈ చిత్రాన్ని భారీ రేట్లకు కొనుగోలు చేశారు. మహేష్ స్పైడర్ చిత్రం ఏకంగా 150 కోట్ల మేర బిజినెస్ చేసి రికార్డు సృష్టించింది. ఆ 150 కోట్లలో థియేటర్స్ హక్కులే 120 కోట్ల పై మేర జరిగింది. అంటే స్పైడర్ చిత్రం అంత మొత్తం కలెక్షన్స్ కొట్టాల్సిందే. మరి అన్ని కలెక్షన్స్ కొట్టే దమ్ము స్పైడర్ కి ఉందా అని అంటే అంతకు మించి ఉందటున్నాయి ట్రేడ్ వర్గాలు.
డిస్ట్రిబ్యూటర్స్ పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడమే కాక బయ్యర్లకు భారీ లాభాలు సంపాదించి పెడుతుంది అంటున్నారు. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టే ఛాన్స్ స్పైడర్ కి పుష్కలంగా ఉందంటున్నారు. సినిమా అవుట్ ఫుట్ చాలా అద్భుతంగా వచ్చిందని.... దర్శకుడు ఊహకందని కథతో స్పైడర్ ని తెరకెక్కించాడని... స్పైడర్ లో వచ్చే ట్విస్ట్ లు అడుగడుగునా అదిరిపోతాయంటున్నారు. సినిమా స్టార్టింగ్ లో కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఆ తర్వాత స్పీడప్ అవుతుందని... అలాగే ట్విస్ట్ లు రివీల్ అయ్యే కొద్దీ సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగిపోతుందని అని ఇన్సైడ్ టాక్. అలాగే హీరోకి విలన్ కి మధ్య మైండ్ గేమ్ మెస్మరైజింగ్ గా ఉంటుందంటున్నారు. స్పైడర్ యాక్షన్ సీన్స్ అయితే అదిరిపోతాయంటున్నారు.
చూద్దాం ఇప్పటివరకు పాజిటివ్ బజ్ లో ఉన్న స్పైడర్ భవితవ్యం రేపు అంటే బుధవారం మొదటి షోకే తేలిపోతుంది. మహేష్ - రకుల్ ప్రీత్ జంటగా తెరకెక్కిన ఈచిత్రంలో ఎస్ జె సూర్య, భరత్ లు విలన్స్ గా నటిస్తున్నారు.

