అన్ని ముఖ్యమైన పాత్రలేనా..?

అనసూయ మెల్లగా వెండితెర మీద బిజీ అవుతుంది. బుల్లితెర మీద గ్లామర్ షోతో అదరగొట్టే యాంకర్ గా అనసూయ పేరు ముందు వరసలో ఉంటుంది. అయితే అమ్మడు ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ ఆమెకు హీరోయిన్ అవ్వాలనే ఆశ మాత్రం పీక్స్ లో ఉంది. అందుకే హాట్ ఫోటో షూట్స్ తో జనాల మతులు పోగొడుతూ తాను దేనికైనా రెడీ అనే సంకేతాలు ఇండస్ట్రీలోకి పంపింది... కానీ పిల్లల తల్లిని హీరోయిన్ గా తీసుకునే ధైర్యం టాలీవుడ్ నిర్మాతలకు లేకపోవడం అనసూయకు కలిసి రాకుండా పోయింది. ఆదెబ్బకు తనకు నచ్చిన సినిమాల్లో ముఖ్యమైన పాత్రలకు సై అంటూ దూసుకుపోతుంది.
క్షణంలో అదిరిపోయే పెరఫార్మన్స్ తో ఆకట్టుకున్న అనసూయ విన్నర్ లో స్పెషల్ సాంగ్ సుయ సుయ అనసూయ తో రెచ్చిపోయింది. ఇక ఇప్పుడు తాజాగా రామ్ చరణ్ రంగస్థలం 1985 లో ఒక ముఖ్యమైన పాత్రకి అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అప్పుడే షూటింగ్ లో పాల్గొనడం జరిగిపోయింది. మరి చరణ్ సినిమాలో అనసూయని కీలక పాత్రకి తీసుకున్నారు అంటే అనసూయ దశ తిరిగినట్లే అన్నారు. అయితే ఇప్పుడు అనసూయకి మోహన్ బాబు, హీరో మంచు విష్ణుల రాబోయే మూవీలో ఛాన్స్ వచ్చినట్టు చెబుతున్నారు.
మదన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కథ ప్రకారం ఈమె క్యారక్టర్ కి ఈ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉందని అంటున్నారు. అయితే ఈ పాత్రకు అనసూయే సరిపోతుందని యూనిట్ భావించి వెంటానే అనసూయని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం అందుతుంది. అయితే అనసూయ మాత్రం నేను హీరోయిన్ పాత్రలను ఆశిస్తే అన్ని ముఖ్యమైన పాత్రలే వస్తున్నాయని సన్నిహితుల వద్ద వాపోతుందట.

