Sun Dec 28 2025 11:09:41 GMT+0000 (Coordinated Universal Time)
అన్నయ్యంటే బన్నీనే.. అంతే మరి!

అవును మరి.. తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు అలాగే అనుకుంటోంది. ఎందుకంటే.. దసరా పండగ సందర్భంగా అన్నయ్య బన్నీ అనగా అల్లు అర్జున్ తన తమ్ముడు శిరీష్ కు ఓ ఖరీదైన కొత్త కారును కానుకగా ప్రెజెంట్ చేశాడు.
శిరీష్ ఇప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు.. అయినా సరే.. ఖరీదైన కారులో దర్జాగా తిరగాలని అన్నయ్యగా బన్నీ అల్లు అర్జున్ సరదా పడ్డాడేమో గానీ.. ఎంచక్కా ఆడీ లేటెస్ట్ మోడల్ కారును తన కానుకగా కొని ఇచ్చాడు.
తమ్ముడిలో ఆ అన్నయ్య గురించి సంతోషం, తండ్రిగా అల్లు అరవింద్ లో ఆనందం ఉంటాయనడంలో సందేహం ఏముంటుంది.
Next Story

