అన్నయ్య ప్రొడక్షన్ లో ఎన్టీఆర్ డబల్ ఏక్షన్

బాలయ్య విషయంలో వారికీ ఇబ్బంది ఏమి లేదు, శాతకర్ణి రికార్డు లు సృష్టించడానికే వస్తున్నాడని వారికీ విశ్వాసం ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లోని నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనే విపరీతమైన సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. జనతా గారేజి తరువాత ఎన్టీఆర్ ఇప్పటిదాకా అసలు సినిమానే ప్రకటించకపోవడం వారి అసంతృప్తికి కారణంగా ఉంది. వారి ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడిపోయింది. ఎన్టీఆర్ 27వ సినిమాను తానే నిర్మిస్తున్నట్టు నందమూరి కళ్యాణ రామ్ ప్రకటించారు.
ఎన్టీఆర్ తరవాతి చిత్రం ఏది? అని ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అధికారికంగా ఎలాంటి సమాచారం రావడం లేదు. ఈలోగా.. ఎన్టీఆర్ బోలెడు మంది దర్శకులను మార్చేసినట్లుగా.. బోలెడు కాంబినేషన్ లు ట్రై చేస్తున్నట్లుగా అనేక పుకార్లు వస్తూనే ఉన్నాయి. తాజాగా నిర్మాతగా తానే చేయబోతున్నట్లుగా నందమూరి కళ్యాణ రామ్ ప్రకటించడంతో సస్పెన్స్ తొలగిపోయింది.
బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో ఎన్టీఆర్ డబల్ ఏక్షన్ చేయబోతున్నట్లు సమాచారం. ఆ మాట వినగానే అభిమానులు అందరికి అదుర్స్ చిత్రం జ్ఞాపకం వస్తుంది. ఆ చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో కామెడీ, ఏక్షన్ అద్భుతంగా చేయగల తమ హీరోతో సరైన కథ తయారుచేసి, వర్క్ ఔట్ చేస్తే.. మరొక బంపర్ హిట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.

