అన్నకి తమ్ముడే విలన్ అంట!!

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ శరేవేగంగా జరుపుకుంటుంది. పవన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్, అను ఇమ్మాన్యువల్ లు నటిస్తుండగా సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, ఇంద్రజలు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఆలాగే హీరో ఆది పినిశెట్టి పవన్ చిత్రంలో నెగెటివ్ రోల్ లో కనబడనున్నాడు. 'సరైనోడు' చిత్రంలో విలన్ గా అదిరిపోయే పెరఫార్మన్స్ ఇచ్చిన ఆది పినిశెట్టి ఇప్పుడు పవన్ సినిమాలో ఎంతటి పవర్ ఫుల్ విలన్ గా కనబడాతాడో అనిఅనుకుంటున్నారు.
అయితే ఆది పినిశెట్టి పవన్ చిత్రంలో పవన్ కి తమ్ముడిగా నటిస్తున్నాడట. ఇక పవన్ అన్నయ్యని ఎప్పుడూ ఇబ్బందులు పెట్టె రోల్‌ని ఆది ప్లే చెయ్యబోతున్నాడన్నమాట. మరి పవన్ తమ్ముడిగా ఆది ఎలాంటి విలనిజాన్ని పండించబోతున్నాడో ఈ చిత్రంలో. ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. అలాగే పవన్ - త్రివిక్రమ్ చిత్రానికి అదిరిపోయే బిజినెస్ కూడా జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

