అనుష్క గురించే హాట్ టాపిక్ అంతా

బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఈ మధ్యన ప్రేమ పెళ్లి వ్యవహారంతోనే కాదు... ఆమె నటిస్తున్న 'పారి', 'సూయ్ ధాగ' సినిమాలతోను బాగా పాపులర్ అయ్యింది. అనుష్క శర్మ క్రికెటర్ విరాట్ కోహ్లీని వివాహమాడక ముందు.. వివాహమాడాక కూడా సినిమాలతో బాగా బిజీగా ఉంటుంది. ఒక పక్క భార్య సినిమాల్తో బిజీగా ఉంటే... మరో పక్క భర్త విరాట్ కూడా విదేశాల్లో విజయాలతో చెలరేగిపోతున్నాడు. అయితే ఇప్పుడు పెళ్లి తర్వాత విరాట్ విజయకేతనం ఎగరేస్తే.. అనుష్క కూడా తన రెండు సినిమాలతో విజయం సొంతం చేసుకోవడానికి తహ తహ లాడుతుంది. 'పారి', 'సూయ్ ధాగ' రెండు సినిమాల్లోనూ అనుష్క రెండు వైవిధ్యమైన పాత్రలతో మెప్పించడానికి రెడీ అవుతుంది.
ఇప్పటికే 'పారి' సినిమా టీజర్ లో అనుష్క శర్మ దెయ్యం లా విరబోసిన జుట్టు, పొలుసులుగా పగిలిన చర్మం, నల్లని పళ్ళతో విపరీతంగా భయపెట్టే రూపంలో అదరగొట్టేస్తే.... మరో సినిమా 'సూయ్ ధాగా'లో మాత్రం కల్లా కపటం తెలియని ఒక సాధారణ పల్లెటూరి గృహిణిగా కనబడుతూ ఆకట్టుకుంటుంది. ఒకే టైం ఇలా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలతో.. అనుష్క శర్మ ప్రేక్షకులను మెస్మరైజ్ చెయ్యడానికి సిద్ధంగా వుంది. రెండు సినిమాల్లోనూ అనుష్క రెండు పాత్రలకు అస్సలు సారూప్యత కనబడదు. మరి అనుష్క మొదటిసారి ఒక హర్రర్ జోనర్ ని టచ్ చేస్తుండడంతో... ఆ సినిమా తనకు మాచి విజయాన్ని అందిస్తుందని మాత్రం గట్టిగా నమ్ముతుంది.
మరో రెండు రోజుల్లోనే అనుష్క నటించిన 'పారి' సినిమా విడుదలవుతుంది. ఇకపోతే అనుష్క శర్మ షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న జీరో సినిమాలోను ఒక వైవిధ్యమైన మరగుజ్జు పాత్ర పోషించడం మరో విశేషం. ఈ జీరో సినిమాలో నాలుగు రోజుల క్రితమే కానరాని లోకాలకు వెళ్లిపోయిన శ్రీదేవి కూడా ఒక గెస్ట్ రోల్ లో నటించింది. మరి ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ లో ఉన్న హీరోయిన్ ఎవరయ్యా అంటే... మాత్రం అనుష్క శర్మ నే అంటున్నారట.

