అదేమిటి అలా మాయం చేశారు

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ లుక్ కోసం పవన్ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఆగష్టు 15 న పవన్ లుక్ రివీల్ చేస్తారని అనుకున్న ఫ్యాన్స్ కి పవన్ అండ్ టీమ్ హ్యాండ్ ఇచ్చింది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అప్పుడు డిస్పాయింట్ ఆయినా... ఆయన బర్త్ డే రోజున మాత్రం ఖచ్చితంగా పవన్ ఫస్ట్ లుక్ ఉంటుందని ఆశపడుతున్నారు. అయితే పవన్ ఫ్యాన్స్ ఆశపడుతున్నట్లే పవన్ కళ్యాణ్ బర్త్ డే సెప్టెంబర్ 2 న పవన్ - త్రివిక్రమ్ కాంబోలో చిత్ర ఫస్ట్ లుక్ రాబోతున్నట్టు అధికారిక ప్రకటన ఇచ్చేసారు.
అంటే పవన్ కళ్యాణ్ కొత్త చిత్ర ఫస్ట్ లుక్ ఆన్ ద వే అని చెప్పేసింది చిత్ర టీమ్. త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ నటించిన 'జల్సా, అత్తారింటికి దారేది' చిత్రాల హిట్స్ ఉన్నాయి కాబట్టే ఈ మూడో చిత్రానికి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. భారీ అంచనాలు కూడా ఉన్న ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చిత్ర ఫస్ట్ లుక్ పవన్ పుట్టిన రోజు కానుకగా ఉండబోతుందని.... అధికారిక ప్రకటనతో పాటే ఒక పిక్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పిక్ లో ఒక్క కళ్ళ జోడు మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆ పిక్ ని నిశితంగా పరిశీలిస్తే మాత్రం పవన్ కళ్యాణ్ చిత్రం క్లాస్ మూవీగా వుండబోతుందా అనే అనుమానము కలగక మానదు.
మరి ఈ చిత్ర టైటిల్ ని కూడా ఫస్ట్ లుక్ తోపాటు విడుదల చేస్తారనే అని డౌట్ కొట్టే లోపు హారిక హాసిని క్రియేషన్స్ వారు ఆ పిక్ ని తమ ఆఫీసియల్ పేజీ నుండి తొలగించేసారు. మరి హారిక అండ్ హాసిని వారు ఎందుకలా పవన్ 25 వ సినిమా పోస్టర్ ని తొలగించారో అర్ధం కాక పవన్ ఫాన్స్ తల పట్టుకున్నారు. మరి ఆ పోస్టర్ తొలగించడం వెనుక ఉన్న కారణమేమిటా అనే శోధనలో పవన్ ఫ్యాన్స్ ఉన్నారట


