అదేం లేదని కొట్టిపారేస్తున్న హీరో

బుధవారం సాయంత్రం సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో, ఛానల్స్ అన్నిటిలో అఖిల్ సెకండ్ మూవీ హలో టీజర్ యూట్యూబ్ నుండి తొలిగించారనే న్యూస్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హైలెట్ అయ్యింది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న హలో సినిమా టీజర్ విషయంలో హలో టీజర్ ని మ్యూజిక్ విషయంలో యూట్యూబ్ కాపీ రైట్ వేసిందని హాట్ హాట్ గా సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఫిన్లాండ్ కు చెందిన ఓ కంపెనీ రూపొందించిన ఎక్సో సూట్ మ్యూజిక్ ని హలో సినిమా కోసం కాపీ కొట్టారని... అందుకే ఆ కంపెనీ హలో టీజర్ మీద కాపీ రైట్ క్లెయిమ్ చేసిందన్నారు.
హలో టీజర్ లోని మ్యూజిక్ ని ఫిన్లాండ్ కు చెందిన ఓ కంపెనీ రూపొందించిన ఎక్సో సూట్ నుండి కొట్టేశారనే విషయం ఒక్కరాత్రిలో మొత్తమంతా పాకిపోయింది. ఆ మ్యూజిక్ ని కాపీ చేసుకున్న వీరు ఆ కంపెనీ వారికి డబ్బు చెల్లించకపోవడంతో... వాళ్ళు కాపీ రైట్ క్లయిమ్ చేశారని అన్నారు. అయితే అదంతా నిజం కాదని... హలో హీరో అఖిల్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ నుండి చిత్ర బృందం వరకు ఈ విషయమై క్లారిటీ ఇస్తున్నట్టుగా ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టాడు. హలో టీజర్ మ్యూజిక్ కు సంబంధించి రియల్లీ స్లో మోషన్ తో తాము కొలాబరేషన్ పెట్టుకున్నామని.... ఆ కంపెనీ వారు సరైన కారణం లేకుండా అనవసరమైన గలాటా సృష్టిస్తున్నారంటూ ఒకింత ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పాపం అఖిల్ హలో సినిమా దగ్గరపడుతోంది. ప్రమోషన్స్ ని కూడా మొదలెట్టే సమయంలో ఇలా హలో టీజర్ ని యూట్యూబ్ నుండి లేపెయ్యడం అనేది కాస్త పరువు పోయే విషయమే. మరి ఈ విషయమై అటు నాగార్జున గాని.. ఇటు దర్శకుడు విక్రమ్ కుమార్ ఎటువంటి స్పందన లేకుండా కామ్ అయ్యారు.

