అదిరింది మొదటి రోజు లెక్కలు

తమిళంలో విజయ ఢంకా మోగించిన విజయ్ మెర్సల్ చిత్రం తెలుగులో మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు నిన్న గురువారం అంటే నవంబర్ 9 న అదిరిందిగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో ఈ చిత్రం కాంట్రవర్సీ లకు కేరాఫ్ అడ్రెస్స్ గా మారి... సినిమాకి సమస్యలు తెచ్చిపెట్టిన డైలాగ్స్ ని తెలుగులో మ్యూట్ చేశారు. అయినా కూడా అదిరింది సినిమాపై విపరీతమైన ఆసక్తితో తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు. నిన్న గురువారం సోలోగా విడుదలైన అదిరింది నేడు శుక్రవారం మాత్రం మూడు సినిమాలనుండి గట్టి పోటీ ఎదుర్కోబోతుంది. అయితే విడుదలయిన మొదటి రోజు అదిరింది కలెక్షన్స్ మాత్రం నిజంగానే అదిరాయి. రెండు రాష్ట్రాలలో అదిరింది మొదటి రోజు కలెక్షన్స్ మీ కోసం.
ఏరియా మొదటి రోజు కలెక్షన్స్ (కోట్లలో)
నైజాం: 0 .50
సీడెడ్: 0 .23
నెల్లూరు: 0 .07
కృష్ణా: 0 .17
గుంటూరు: 0 .20
వైజాగ్: 0 .29
తూర్పు గోదావరి: 0 .13
పశ్చిమ గోదావరి: 0 .08
ఏపీ మరియు తెలంగాణ కలిపి మొత్తం: 1.67 కోట్లు

