అదరగొడుతున్న అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి సినిమా విడుదలకు ముందు కాట్రవర్సల్ తో సినిమాపై విపరీతమైన నెగివ్ పబ్లిసిటీ వచ్చింది. అయినా తమ సినిమా మీద ఉన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు, హీరోగారు ఏ మాత్రం దడవకుండా తమ సినిమాని థియేటర్స్ లోకి దింపారు. ఆ సినిమా అందరికి షాక్ ఇస్తూ సక్సెస్ ఫుల్ గా మొదటిరోజు సూపర్ కలెక్షన్స్ తో దూసుకుపోయింసి. పెళ్లి చూపులతో మెల్లగా ఇండస్ట్రీలో పాగా వెయ్యడానికి వచ్చిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి తో పాతుకుపోయాడు. అర్జున్ రెడ్డిగా విజయ్ పెరఫార్మెన్సు సూపర్బ్ అంటూ కితాబిస్తున్నారు అందరూ. ఇక యూత్‌ను టార్గెట్ చేస్తూ విడుదలైన ఈ చిత్రం అన్ని ఏరియాల్లో దుమ్ముదులిపేసిందని సమాచారం. ఆంధ్ర - నైజాంల్లో సుమారు 2 కోట్ల 40 లక్షల షేర్ రాబట్టినట్టు టాక్. అంతేకాకుండా ఏ సెంటర్స్‌లో స్ట్రాంగ్‌గానే వసూళ్లు రాబడుతుందని చెబుతున్నారు. లిప్‌లాక్స్‌తో ఈ సినిమా టాలీవడ్ లో రికార్డు క్రియేట్ చేసింది. అయితే నైజాం మినహా మిగతా ఏరియాల్లో అర్జున్‌రెడ్డి కలెక్షన్స్ లేవని ట్రేడ్ వర్గాల సమాచారం.
అర్జున్ రెడ్డి కలెక్షన్స్ మీ కోసం
నైజాం- 1.15 లక్షలు
సీడెడ్- 33 లక్షలు,
కృష్ణ- 25 లక్షలు
ఉత్తరాంధ్ర- 21 లక్షలు
గుంటూరు- 20 లక్షలు
ఈస్ట్- 12 లక్షలు
వెస్ట్- 9 లక్షలు
నెల్లూరు-5 లక్షలు.
టోటల్‌గా 2 కోట్ల 40 లక్షలు అర్జున్ రెడ్డి వసూలు చేసినట్టు తెలుస్తోంది.
ఇక ఓవర్సీస్లో అర్జున్‌రెడ్డి కలెక్షన్లు బాగున్నాయని బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్టు ఒకరు చెబుతున్నారు. ఒక్క ప్రీమియర్ షోలకే కోటికిపైగా రాబట్టినట్టు సమాచారం అందుతుంది.

