అదరగొడుతున్న అజ్ఞాతవాసి ప్రీ రిలీజ్ బిజినెస్

పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా మరో నాలుగు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది. త్రివిక్రమ్ డైరెక్షన్, పవన్ మానియా, అనిరుధ్ మ్యాజిక్ మేజిక్, కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ లాంటి ముద్దుగుమ్మలు హీరోయిన్లు కావడంతో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ పవన్ కెరీర్లోనే ఆల్ టైం రికార్డుగా ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. అన్ని ఏరియాల్లోనూ పవన్ కెరీర్లోనే టాప్ రేట్లకు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్ముడవుతున్నాయి.
ఓవరాల్‌గా అజ్ఞాతవాసికి వరల్డ్‌వైడ్‌గా రూ.150 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెపుతున్నాయి. తెలుగులో బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇలా ఉన్నాయి..
అజ్ఞాతవాసి ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్ (రూ . కోట్లలో )
నైజాం - 29.0
సీడెడ్ - 16.20
ఉత్తరాంధ్ర - 11.70
గుంటూరు - 9.0
ఈస్ట్ - 8.1
కృష్ణా - 7.0
వెస్ట్ - 6.75
నెల్లూరు - 4.05
-------------------------------
ఏపీ+తెలంగాణ = 91.80
------------------------------
కర్ణాటక + తమిళనాడు + నార్త్ ఇండియా - 11.70
ఓవర్సీస్ - 19.0
----------------------------------
టోటల్ వరల్డ్ వైడ్ - 122.50
----------------------------------
శాటిలైట్ - 32.0
ఆడియో - 2.0
------------------------------------------------------------------
టోటల్ వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ = 156.50 కోట్లు
------------------------------------------------------------------

