అచ్చం పల్లెటూరి అమ్మాయే!!

ఎప్పుడూ సోషల్ మీడియాలో హడావిడి చేసే సమంత, తన ప్రొఫెషన్ లైఫ్ తో పాటే పర్సనల్ లైఫ్ కి సంబందించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూ చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఇప్పుడు కూడా తాను చేస్తున్న చిత్రాల విశేషాలతోపాటే తన పెళ్లి విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సంబరపడిపోతుంది. తాజాగా సమంత, రామ్ చరణ్ తో 'రంగస్థలం 1985 ' లోను, 'మహానటి సావిత్రి'లోనూ, 'రాజుగారి గది 2 ' లో నటిస్తుంది. ఇక నాగ చైతన్యతో పెళ్లి కూడా వచ్చే అక్టోబర్ 6 న గోవాలో జరగనుంది.
పెళ్లికోసం సినిమాల షూటింగ్ త్వరితగతిన కంప్లీట్ చేసి మూడు నెలల విరామం తీసుకోనుంది సామ్. అందుకే షూటింగ్ లో విరామంలేకుండా పాల్గొంటుంది. సుకుమార్ డైరెక్షన్ లో రామ్ చరణ్ తో చేస్తున్న 'రంగస్థలం' చిత్రం అంతా 1980 లో పాత కాలపు పల్లెటూరి ప్రేమకథ కాబట్టి... ఆ పల్లెటూరి వాతారవరణం కోసం డైరెక్టర్ సుకుమార్ ఆ చిత్ర షూటింగ్ ని ఎక్కువ శాతం రాజమండ్రి, గోదావరి పరిసర ప్రాంతాలలోనే చేస్తున్నాడు. ఇక అక్కడ షూటింగ్ స్పాట్ లోనుండి ఎప్పటికప్పుడు కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది సమంత.
మొన్నామధ్యన ఒక్క పాదాలు మాత్రమే చూపిస్తూ గోదావరి అందాలు తిలకిస్తున్న ఫోటోని షేర్ చేసిన సామ్ ఇప్పుడు తన పేస్ ని కవర్ చేస్తూ వీపు, పెద్ద జడని చూపిస్తూ వెనుకనుండి తీసిన ఫోటోని షేర్ చేసింది. అందులో సమంత పల్లెటూరి అమ్మాయి ఎలా ఉంటుందో అచ్చం అలాగే కనబడుతుంది. ఫేస్ కనబడకపోయినా సమంత రూపురేఖలు ఎలా వుంటాయో వెనుక నుండి చూస్తుంటే ఒక అంచనాకి వచ్చెయ్యొచ్చు. మరి పొడుగాటి జుట్టు, చీరకట్టు అవన్నీ చూస్తుంటే సమంత రంగస్థలంలో ఎలా వుండబోతుందో కాస్తంత అర్ధమవుతున్నట్టే వుంది. మరి మీరు సమంత పిక్ ని ఒకసారి చూసి ఆనందించండి.


