అచ్చం నాలాగే కనబడుతున్నాడు

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ తాజా చిత్రం' అర్జున్ రెడ్డి' గురించే ట్రెండ్ అవుతుంది. ఆ సినిమా అంతా బూతుల మాయం అని... ఆ సినిమాలో అన్ని లిప్ లాక్ కిస్సులే ఉన్నాయనే ప్రచారం మాములుగా జరగడంలేదు. ఆ సినిమాలో ఉన్న బూతులు వలెనే సినిమాకి సెన్సార్ వారు ఏ సర్టిఫికెట్ ఇవ్వడము... అలాగే కొన్ని మూట్స్ కూడా కావలనడమూ జరిగిపోయాయి. అయితే 'అర్జున్ రెడ్డి' హీరో విజయ్ మాత్రం ఆ సినిమాలో ఉన్న బూతు పదాలను పబ్లిసిటీ కోసం ఫుల్ గా వాడేసుకుంటున్నాడు.
ఇక ఆ లిప్ లాక్ కిస్ లు ఉన్న పోస్టర్స్ అయితే ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సెన్సేషన్ అవుతున్నాయి. మహిళా సంఘ నేతలైతే ఆ లిప్ లాక్ పోస్టర్స్ గనక తియ్యకపోతే సినిమా విడుదల ఆపేస్తామంటూ రచ్చ స్టార్ట్ చేశాయి. అలాగే కాంగ్రెస్ నేత హనుమంతరావు అయితే ఆ లిప్ లాక్ పోస్టర్స్ ఉన్న సిటీ బస్సు ల మీద చూసి కోపంతో చించి పారేసాడు. దానికి హీరో విజయ్ మాత్రం 'తాతయ్య చిల్' అంటూ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హనుమంత రావు గారి మీద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఫైర్ అవుతున్నాడు.
ఎప్పుడూ ఎలాంటి విషయంలో కలగజేసుకుంటాడో తెలియక తికమక పడే జనాలు ఇప్పుడు 'అర్జున్ రెడ్డి' లిప్ లాక్ కిస్ పోస్టర్స్ తో మరోసారి రెచ్చిపోయాడు. ‘అర్జున్ రెడ్డి’ టీజర్ - ట్రైలర్ల విడుదలైనప్పుడు ఏమీ మాట్లాడని రామ్ గోపాల్ వర్మ .. చాలా లేట్ గా తన స్పందనని తెలియజేశాడు. ఈ సినిమా ట్రైలర్ గురించి ఇప్పుడు ఇన్నాళ్ళకి వర్మ స్పందించాడు. ‘అర్జున్ రెడ్డి’ ట్రైలర్ అద్భుతంగా ఉందన్న వర్మ.. విజయ్ దేవరకొండ చాలా విషయాల్లో తన మెన్టాలిటీకి దగ్గరగా కనిపిస్తున్నాడని చెబుతున్నాడు. కాకపోతే తాను ఇంకా చనిపోకుండానే తనలాంటి విజయ్ ఎలా పుట్టాడో అర్థం కావడం లేదని వెరైటీగా స్పందించాడు.
అంతేకాకుండా 'అర్జున్ రెడ్డి' పోస్టర్స్ ని సిటీ బస్సు ల మీద చించేసిన హనుమంత రావు కి కూడా గట్టిగానే కౌంటర్ వేసాడు ఆర్జీవీ. వీహెచ్ గారు పోస్టర్లు చించినట్లే.. విజయ్ నువ్వు వెళ్లి ఆయన చొక్కాను చించాలని విజయ్ దేవరకొండకి సూచించాడు. ఈ పోస్టర్స్ మీలాంటి తాతలకి కాదంటూ వీహెచ్ పై తనదైన స్టయిల్లో వర్మ తన స్పందన తెలియజేశాడు.

