Thu Dec 25 2025 23:06:01 GMT+0000 (Coordinated Universal Time)
అఖిల్ కోసం ఆ దర్శకుడా.. వద్దంటున్న ఫ్యాన్స్

అఖిల్ హీరోగా చేసిన 'అఖిల్' సినిమా రిలీజ్ అయ్యి చాలా రోజులు కావొస్తుంది. అయితే అఖిల్ రెండో సినిమా ఇంతవరకు పట్టాలెక్కలేదు. 'అఖిల్' సినిమా ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి అక్కినేని ఫ్యామిలీకి చాలా రోజులే పట్టింది. ఇక నాగార్జున ఆ మధ్యన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో అఖిల్ తన రెండవ చిత్రాన్ని చేస్తున్నాడని ప్రకటించినప్పటికీ అది ఇంతవరకు పట్టాలెక్కలేదు. కారణం ఏమిటనేది తెలియదు. మరి ఇప్పటికైనా విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో ఈ మూవీ ఉంటుందా లేక మళ్ళీ దర్శకుడు మారతాడా... అనేది ఇంకా సస్పెన్స్ గానే సాగుతుంది. ఇప్పటికే అఖిల్ రెండో సినిమాకి అనేకమంది దర్శకుల పేర్లు బయటికి వచ్చాయి. ఆఫీషియల్ గా మాత్రం నాగార్జున విక్రమ్ పేరు చెప్పాడు. ఇక రెండో సినిమాకే ఇప్పటివరకు దిక్కు లేదుగాని ఇప్పుడు అఖిల్ మూడో సినిమా గురించి ప్రచారం మొదలైంది.
అఖిల్ తన 3 వ చిత్రాన్ని బోయపాటి శ్రీను డైరెక్షన్ లో చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి. ఇది నిజమో లేక రూమరో గాని అఖిల్ బోయపాటితో సినిమా చెయ్యడం కరెక్ట్ కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే అఖిల్ తన మొదటి సినిమా మాస్ లుక్ లో కనిపించి అంతగా మెప్పించలేకపోయాడు. మరి బోయపాటి శ్రీను ఖచ్చితం గా అఖిలని మాస్ లూక్లోనే ప్రెజెంట్ చేచూపిస్తాడు గాని కొత్తగా ఏమి చెయ్యడు కాబట్టి అఖిల్ ఆలోచించుకుంటే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలామంది. అఖిల్ ఏదైనా ఫ్యామిలీ చిత్రం గాని లవ్ కి సంబందించిన సినిమా గాని చేసి తనని తానూ ప్రూవ్ చేసుకున్నాక మాస్ చిత్రాల జోలికి వెళ్లడం మంచిదని చెబుతున్నారు. మరి ఈ కామెంట్స్ విన్న నాగార్జున అఖిల్ కి మంచి సలహా ఇస్తాడేమో చూద్దాం.
Next Story

