అక్కడా... ఇక్కడా.. బ్లాక్ బస్టరే!!

ఫిదా చిన్న చిత్రంగా విడుదలై కలెక్షన్స్ వర్షం కురిపించేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ - సాయి పల్లవిలు జంటగా నటించారు. సినిమా మొత్తం సాయి పల్లవి నటనతో, డాన్సులతో కేక పుట్టించింది. సినిమా విడుదలై మూడు నెలలు కావొస్తున్నా ఫిదా చిత్రం గురించిన చర్చలు సోషల్ మీడియాలో ఇంకా జరుగుతున్నాయి అంటే ఏ ఈసినిమా ప్రభంజనం ఏ రేంజ్ లో ఉందొ చెప్పుకోవచ్చు. భానుమతిగా ఫిదా క్రెడిట్ మొత్తం సాయి పల్లవి కొట్టుకుపోయింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
బుల్లితెర పైన కూడా.....
ఇక ఫిదా సినిమాకి బుల్లితెర ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. స్టార్ మాలో సెప్టెంబరు 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమైన ఫిదా సినిమా 21.30 టీఆర్పీ సాధించి.. అదరహో అనిపించింది. అసలు ఇటీవలి కాలంలో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన సినిమాగా ఫిదా నిలిచింది. ఇక రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రం బులితెర మీద అత్యధికంగా 22 టిఆర్పి రేటింగ్స్ సాధించి మొదటి స్థానంలో నిలవగా... బాహుబలి1 21 .84 తో రెండో స్థానంలో నిలిచింది. ఇక శ్రీమంతుడు (21.24), సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు (20), అత్తారింటికి దారేది (19.04) మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతుండగా ఇప్పుడు ఫిదా చిత్రం మగధీర, బాహుబలి1 తర్వాతి స్థానం అంటే మూడో స్థానాన్ని ఆక్రమించి శ్రీమంతుడు, సీతమ్మ.., అత్తారింటికి దారేది చిత్రాలను వెనక్కి నెట్టేసి అమ్మో... అనిపించింది.
ఎప్పటికీ స్పెషల్ ......
మరి బడా హీరోల సినిమాల టీఆర్పీ రేటింగ్స్ తో పోటీ పడ్డ చిన్న చిత్రం ఫిదా మాత్రం ఎప్పటికి స్పెషల్ గానే ఉంటుంది అంటున్నారు. ఇకపోతే రేపు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి బాహుబలి2 వరల్డ్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం కాబోతుంది. మరి బాహుబలి2 టీఆర్పీ రేటింగ్స్ ని అందుకోవడం ఇప్పట్లో ఏ స్టార్ హీరోకి సాధ్యం కాదమో అంటున్నారు. చూద్దాం బాహుబలి2 టీఆర్పీ రేటింగ్స్ ఏ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తాయో..!
- Tags
- ఫిదా

