అక్కడ మనలేక.. ఇక్కడ గ్యాప్ ఇవ్వనంటుంది!!

ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాతో తెలుగు ప్రేక్షకుల కంట్లో పడింది నందిత శ్వేత. తన యాక్టింగ్ తెలుగు ప్రేక్షకులని మెప్పించింది.ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా ఇప్పటివరకు మరో తెలుగు సినిమాకు సైన్ చేయలేదు. తెలుగులో మరి అవకాశం రాకో.. లేకుంటే అనేది క్లారిటీ లేదు.
కోలివుడ్ కు వెళ్లి....
అయితే ఎక్కడికి పోతావ్ చిన్నవాడాతో ఈ అమ్మడు డైరెక్ట్ గా కోలీవుడ్ కి వెళ్ళిపోయింది. అక్కడ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ కోలీవుడ్ లో క్లిక్ అవ్వలేకపోయింది. ఆమె నటించిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వక ఈసారి మళ్లీ టాలీవుడ్ వైపు దృష్టి సారించింది ఈ బెంగళూరు బ్యూటీ.
తెలుగులో గ్యాప్ ఇవ్వకుండా....
రీసెంట్ గా తణుకులో ఓ షాప్ ప్రారంభోత్సవానికి ప్రత్యేక అతిథిగా వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఇకపై తెలుగులో గ్యాప్ ఇవ్వకుండా సినిమాలు చేస్తానంటుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు సినిమాలు అంగీకరించారని.. త్వరలోనే ఆ సినిమాల డీటెయిల్స్ చెబుతానంటోంది ఈ ముద్దు గుమ్మా.
- Tags
- నందిత శ్వేత

