అక్కడ పూర్తయిపోయింది... మరి ఇక్కడ!!

బాలీవుడ్ లో ఫేమస్ అయిన బిగ్ బాస్ షోని కోలీవుడ్, టాలీవుడ్ లలోకి దించుతున్నారు. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఈ బిగ్ బాస్ ప్రోగ్రాం వచ్చే నెలలో ప్రారంభం కానుంది. కానీ తమిళంలో కమల్ హాసన్ హోస్ట్ గా ఈ షో అప్పుడే గ్రాండ్ గా లాంచ్ చేసుకుని పార్టిసిపేట్స్ ఇంట్రడక్షన్స్ కూడా పూర్తి చేసుకుంది. ఇంకా తెలుగులో అయితే పార్టిసిపేట్స్ ఎంపిక పూర్తికాలేదుగాని తమిళంలో ఎప్పుడో పూర్తైపోయిందని కోలీవుడ్ పార్టిసిపేట్స్ చూస్తుంటే అర్ధమవుతుంది.
కమల్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో లో మొత్తం 15 మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే బాలీవడ్ లో ఫెమస్ మోడల్స్ గట్రా ఈ షో లో పార్టిసిపేట్ చేసారు గాని సౌత్ లో అలాంటి వారెవరు కనబడంలేదు. అందుకే కోలీవుడ్ బిగ్ బాస్ పార్టిసిపేట్స్ ని చూస్తుంటే అబ్బో అనే రీతిలో ఎవరూ లేరు. ఇక కోలీవుడ్ బిగ్ బాస్ పార్టిసిపేట్స్ వివరాలు ఇలా వున్నాయి. శ్రీ, అనుయ, వైయాపురి,గాయత్రి రఘురాం, భరణి, రైజా,స్నేహన్, ఒవియా, హారతీ గణేష్,ఆరర్, గంజా కరుప్పు,జులియానా, గణేష్ వెంకట్రామ్, శక్తి , నమితలు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు.
ఇక వీరందరిలో ముఖ్యంగా మనం నమిత గురించే చెప్పుకోవాలి. కోలీవుడ్ తోబాటు టాలీవుడ్ కి పరిచయమైన నమితకు ఇప్పుడు తెలుగులోకాని, తమిళంలోకాని అవకాశాలు లేక పాపంఖాళీగా ఉంటుంది. ఇక ఇప్పుడు ఈ షో తమిళంలోనే గనక నమిత ఈ షోతో మరింత పాపులర్ అయిపోదామని ఈ షోలో పార్టిసిపేట్ చేస్తుందన్నమాట. ఎలాగూ తమిళులకు నమిత అంటే ఇష్టం కాబట్టి ఈ షోలో సెలెక్ట్ చేశారన్నమాట. ఇక ఇందులో వీరంతా ఈ బిగ్ బాస్ రియాలిటీ షో లో పాల్గొని అక్కడిఅందరిని ఓడించి ప్రైజ్ మెనీ కొట్టేయాలని చూస్తున్నారు.

