అక్కడ నాని పాచిక పారెనా?

నాని వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని నుండి సినిమా వస్తుంది అంటే అందరిలోనూ ఆసక్తి ఏర్పడిపోతుంది. అందునా ఇప్పుడు నాని నుండి వస్తున్నా ఎంసీఏ సినిమాని మంచి టేస్ట్ గల దిల్ రాజు నిర్మించడం, మరోవైపు ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటించడం వంటి విషయాలతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకే దర్శక నిర్మాతలు, హీరో కి కూడా తమ సినిమా విజయాన్ని అందుకుంటుందనే ధీమాతో అఖిల్ హలో కి పోటీగా దిగడానికి రెడీ అయ్యారు. అయితే నాని తన కెరీర్ లో ఎక్కువగా రెగ్యులర్ కమర్షియల్ కథలనే ఎంచుకుంటున్నాడు. కొత్తగా ఏం ట్రై చెయ్యడం లేదనే టాక్ ఎప్పటినుండో వినబడుతుంది.
అయితే ఇప్పుడు నాని నటిస్తున్న ఎంసీఏ సినిమా కూడా రెగ్యులర్ కథగానే అనిపిస్తుందంటున్నారు. అందులోను ఎంసీఏ ట్రైలర్ చూస్తుంటే కాస్త రొటీన్ గా కనబడుతుంది. ట్రైలర్ విడుదలైన రెండో నిమిషం నుండే ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పడూ ఈ రొటీన్ కథ వలన నాని మార్కెట్ కి ఏమైనా నష్టం కలుగుతుందా అంటే.. ఏమో చెప్పలేం కలిగినా కలగొచ్చనే టాక్ వినబడుతుంది. ముఖ్యంగా ఓవర్సీస్ లో నాని గత సినిమాల మార్కెట్ ఇప్పటివరకు బాగానే వుంది. కానీ ఇప్పుడు ఈ ఎంసీఏ తో నాని ఆ మార్కెట్ ని కంటిన్యూ చేస్తాడో లేదో అనే అనుమానంలో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు. తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ ఎంతో కీలకం. ఇప్పుడు నాని గత చిత్రాలను దృష్టిలో పెట్టుకొని యూఎస్ లో ఎంసీఏ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
అయితే ఈ సినిమా ట్రైలర్ రొటీన్ గా ఉండటం వల్ల దాని ప్రభావం అడ్వాన్స్ బుకింగ్స్ పై పడొచ్చు అని టాక్. దానికితోడు ఎంసీఏ తో పాటు విడుదలవుతున్న హలో సినిమాపై కొంచెం మీడియం రేంజ్ లో మంచి అంచనాలే ఉన్నాయి. హలో ట్రైలర్ కు స్పందన బాగానే వచ్చింది. మరి ఈ లెక్కన నాని ఎంసీఏ మొదటిరోజు టాక్ లో చిన్న తేడా వచ్చిన భారీగా కలెక్షన్స్ డ్రాప్ అవుతాయంటున్నారు. అలాగే సినిమా టాక్ బావున్నా రెగ్యులర్ కమర్షియల్ అంటే ప్రవాసులకు అంతగా నచ్చదు. మరి నాని ఎంసీఏ తో ప్రవాసులను ఎలా ఆకట్టుకుంటాడో అనేది ఒక్క వారంలో తేలిపోతుంది.

