అక్క కన్నా చెల్లె నయం

మహేష్ బాబు - సుకుమార్ కాంబోలో గతంలో వచ్చిన 1 నేనొక్కడినే సినిమాతోనే బాలీవూడ్ భామ కృతి సనన్ తెలుగు తెరకి పరిచయం అయ్యింది. అయితే మొదటి తెలుగు సినిమా కృతి సనన్ కి పెద్దగా విజయాన్ని అందించలేదు. ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా కృతి ని టాలీవుడ్లో టాప్ రేంజ్ కి చేర్చలేకపోయాయి. ఇక టాలీవుడ్ లో నెగ్గలేక బాలీవుడ్ కి తిరిగెళ్ళిపోయి అక్కడే సినిమాలు చేసుకుంటూ సెటిల్ అయ్యింది. కృతి సనన్ కథల విషయంలో పర్ఫెక్ట్ గా లేకపోవడం వల్లనే ఆమెకు తరుచు పరాజయాలు ఎదురయ్యాయని ప్రేక్షకులు బహింగంగానే చెప్పుకునేవారు. సినిమాల విషయంలో ఎలా వున్నా హాట్ ఫోటో షూట్స్ తో అమ్మడు ఎప్పుడు సోషల్ మీడియాలోనే చక్కర్లు కొడుతోంది.
ఇకపోతే ప్రస్తుతం కృతి సనన్ చెల్లెలు సుపూర్ సనోన్ కూడా మోడలింగ్ నుండి వెండితెరవైపు అడుగులు వేస్తుంది. గత కొన్నేళ్లుగా మోడలింగ్ రంగంలో ఉన్న సుపూర్ సనోన్ అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందుకే ఇక వెండితెరకు పరిచయమవ్వాలని అమ్మడు జాగ్రత్తగా స్టెప్పులు వేస్తుంది. ప్రస్తుతం మోడలింగ్ రంగంలో రాణిస్తూ క్యూటీ లుక్ ఫొటోస్ తో సోషల్ మీడియాలో టచ్ లోనే ఉన్న ఈ సుపూర్ సనోన్ కి ఎవరైనా పిలిచి అవకాశం ఇస్తే మాత్రం చక్కగా సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటుంది. మరి ట్రెడిషనల్ లుక్ తోనే సుపూర్ సనోన్ సినిమాల్లో రాణించాలని అనుకుంటుందట. అందుకే గ్లామర్ సైడ్ తీసుకోకుండా ట్రెడిషినల్ లుక్ లోనే ఎక్కువగా హల్చల్ చేస్తుంది.
మరి కృతి సనన్ మీద సుపూర్ సనోన్ లుక్స్ పరంగా బాగుందనే కామెంట్స్ వినబడుతున్నాయి. ఇక గ్లామర్ డోస్ లేకుండా పద్ధతైన లుక్స్ లోనే సుపూర్ సనోన్ సినిమాల్లో ఎలా నటించాలో లాంటి సలహాలను సుపూర్ సనోన్ తన అక్క దగ్గరనుండి తీసుకుంటుదట. అయితే ప్రస్తుతం సుపూర్ సనోన్ కి ఆఫర్స్ వస్తున్నా చాలా ఆచి తూచి కథ నచ్చాకే.... ఆ పాత్ర తనకి సెట్ అయ్యేలాగా ఉండే సినిమాలనే ఒప్పుకోవాలని డిసైడ్ అయ్యిందట. చూద్దాం అక్కలాగా కాకుండా సుపూర్ సనోన్ ఏమైనా టాప్ పొజిషన్ కి చేరుతుందేమో.


