అందుకే ఈయన దగ్గరకి వచ్చింది!!

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ - సాయి పల్లవి జంటగా నటించిన 'ఫిదా' చిత్రం క్లిన్ 'యు' తో విడుదలకు సిద్ధమైంది. అందుకే సినిమా ప్రమోషన్స్ ని కూడా వేగవంతం చేసింది చిత్ర యూనిట్. మరి పబ్లిసిటీ మీద ఇంతగా ఫోకస్ పెట్టడానికి అక్కడున్న నిర్మాత ఎవరు దిల్ రాజు. అందుకే పబ్లిసిటీ కార్యక్రమాలు అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి.ఇక ఇపుడు ఈ 'ఫిదా' ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు బోలెడు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇప్పటికే 'డీజే' కలెక్షన్స్ విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు... ఇప్పుడు 'ఫిదా' కథ గురించి చెబుతున్నాడు. ఈ 'ఫిదా' స్టోరీ చాలా కీలమైందని .... ఇందులో వరుణ్ తేజ్ చాలా బాగా నటించాడని చెబుతున్న దిల్ రాజు అసలు ఈ కథని శేఖర్ కమ్ముల తన దగ్గరికి ఎప్పుడో తెచ్చాడని... కథ నచ్చిన నేను ఈ కథతో ముగ్గురు స్టార్ హీరోలను కలిశానని... కానీ ఆ కథ ఆ ముగ్గురు హీరోలకు విపరీతంగా నచ్చినా కూడా.... ఆ కథ తమకి సరిపోదని.... ముగ్గురు హీరోలు ఫీల్ అవడంతో అదే కథకు వరుణ్ తేజ్ సరిపోవడంతో ఈ సినిమా తెరకెక్కిందని చెబుతున్నాడు నిర్మాత దిల్ రాజు.
మరి ఆ కథని ఏ హీరోలకు వినిపించాడో దిల్ రాజు క్లారిటీ ఇవ్వలేదుగాని.... మొదటగా ఈ కథ మాత్రం మహేష్ దగ్గరకు వెళ్లిందని చెబుతున్నారు. అక్కడనుండి మరో స్టార్ హీరో రామ్ చరణ్ దగ్గరికి కూడా వెళ్లినట్లు కూడా ప్రచారం జరుగుతుంది. కానీ మరో మూడో హీరో ఎవరనేది మాత్రం చిన్న గాసిప్ కూడా బయటికి రాలేదు. ఇకపోతే ఈ చిత్రం ఇంతమంది హీరోస్ రిజక్ట్ చేశారు కదా. మరి మెగా హీరో వరుణ్ తేజ్ కి ఈ కథ ఎంతగా సెట్ అయ్యిందో మరో రెండు రోజుల్లో తెలిసిపోనుంది. ఇక ఈ చిత్రంలో ప్రేమమ్ బ్యూటీ సాయి పల్లవి హీరయిన్ గా తెలంగాణ యాసతో చంపేస్తుంది.

