అందాల ఆరబోతలో భామలు అరిపించేసారు!!

సినిమాల్లో ఎంతగా అందాలు ఆరబోసినా...ఏం పనిజరగడం లేదని భావించిన హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కడైనా పబ్లిక్ ఫంక్షన్ జరుగుతుంది అంటే అక్కడికి కూడా సెక్సీ డ్రెస్సెస్ తో వాలిపోతున్నారు. ఆ ఫంక్షన్స్ లో ఆడియో వేడుకలు ఉంటాయి.. అలాగే షాప్ ఓపెనింగ్స్ ఉంటాయి.. అన్నిటికన్నా ముఖ్యంగా అవార్డు ఫంక్షన్స్ ఉంటాయి. ఈ అందాల ఆరబోతకు మాత్రం హీరోయిన్స్ అస్సలు కాంప్రమైజ్ కావడంలేదు. ఒకప్పుడు ఈ ట్రెండ్ కేవలం బాలీవుడ్ లో మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ అన్ని భాషలకు పాకిపోయింది. ఇక సదరు హీరోయిన్స్ సినిమాల్లో అవకాశాల కోసం ఈ గ్లామర్ షోకి దిగుతున్నారు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే సినిమాల్లో టాప్ పొజిషన్ లో దూసుకుపోతున్న హీరోయిన్స్ కూడా ఈ ట్రెండ్‌లో దూసుకుపోతూ మిగతా హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్నారు.
ఇంతకీ ఇప్పుడు ఈసోదంతా ఎందుకంటే బాలీవుడ్ లో తాజాగా జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ కి అక్కడి హీరోయిన్స్ ఎలాంటి డ్రెస్సుల్లో కనబడి సందడి చేశారో అనే చర్చ ఇప్పుడు అన్ని భాషల సర్కిల్స్ లోను హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ అవార్డు ఫంక్షన్ కూడా అందం కోసం పెట్టిన అవార్డు ఫంక్షన్ కావడంతోనే హీరోయిన్స్ అంతగా రెచ్చిపోయి అందాల ఆరబోతకు దిగారు. బాలీవుడ్ లో వోగ్ బ్యూటీ పేరిట ప్రతి ఏడాది ఒక అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఆ వోగ్ బ్యూటీ అవార్డ్స్ 2017 అదిరిపోయే లెవల్లో జరిగింది.
ఇక ఆ అవార్డ్స్ ఫంక్షన్ కి హాజరైన భామలకు వేసిన దుస్తులు చూస్తుంటే మతులు పోవాల్సిందే. ఐశ్వర్య రాయ్, పూజ హెగ్డే, సన్నీ లియోన్, కరిష్మా కపూర్, అమితాబ్ ఫ్యామిలీలో ఆయన కూతురు స్వేతా బచ్చన్, ఆయన భార్య జయ బచ్చన్, మనవరాలు నవ్య, షమితా శెట్టి లు ఇంకా బాలీవుడ్ హీరోయిన్స్ ఆ వోగ్ బ్యూటీ అవార్డ్స్ రెడ్ కార్పెట్ మీద అందాల ఆరబోసుకుంటూ నడిచొస్తుంటే చూడాలి మరి చూపు మరల్చుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇక ఈ అవార్డు వేడుకకి హాజరైన వారంతా ఒకరితో ఒకరు పోటీ పడుతూ తమ అందాలను ప్రదర్శించేసారు.

