అందరూ తిడుతున్నారంటున్న మంచు హీరో!!

మొన్నామధ్యన మంచు విష్ణు మలేషియాలో యాక్సిడెంట్ కి గురై హాస్పిటల్ ఐసియులో చికిత్స పొందుతున్నట్లు తెలిసిన విషయమే. ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ కోసం మలేషియాలో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో మంచు విష్ణు గాయపడగా చిత్ర యూనిట్ విష్ణుని హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే పెద్దగా గాయాలేమి అవలేదని కొద్దీ రోజులు విష్ణు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని... డాక్టర్స్ చెప్పారు. ఇపుడు కొద్దిగా కోలుకున్న మంచు విష్ణు తనకి జరిగిన యాక్సిడెంట్ గురించి సోషల్ మీడియా ద్వారా అందరికి వివరించాడు.
తనకు ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే ఎంతోమంది సన్నిహితులు, తెలిసిన వారు ఫోన్ చేశారని..... అయితే ఈ ఘటనకు సంబంధించి తన తల్లిదండ్రులకు, భార్యకు, తమ్ముడికి, చెల్లికి సారీ చెబుతున్నానని భావోద్వేగానికి లోనయ్యాడు. కేవలం తాను చిన్న జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల కుటుంబ సభ్యులు ఎంతో బాధపడాల్సి వచ్చిందని విష్ణు సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. అయితే ఈ విషయంలో శ్రేయోభిలాషులు, అభిమానులను క్షమాపణ కోరుతున్నట్లు విష్ణు తెలియజేశాడు.
అయితే తనకి యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందో అందరికి తెలిసేలా ఒక వీడియో విడుదల చేస్తానని చెబుతున్నాడు. నాకు తగిలిన ఈ దెబ్బలనుండి కోలుకుని...... ఇలా అందరి ముందు మాట్లాడుతున్నానంటే.. నిజంగా అది దేవుడిచ్చిన వరమని విష్ణు చెప్పుకొచ్చాడు. తన మోకాలికి దెబ్బ తగిలిందని, భుజం రోడ్డుకు బాగా గీసుకుపోయిందని విష్ణు తెలిపాడు. ఘటన జరిగిన వెంటనే హీరో నితిన్ ఏం జరిగిందని తనకి ఫోన్ చేసి మరి పలకరించాడని.... ఇక కల్యాణ్ రామ్ అయితే తిడుతూ ఎస్ఎంఎస్ పెట్టాడని.... పిల్లలున్నారని, ఇలాంటి రిస్క్ ఎందుకు చేస్తావని తన మంచి కోరి కొంచెం ఘాటుగా ఎస్ఎంఎస్ పెట్టినట్లు మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.

