అంతా నాగే చూసుకుంటున్నాడా ...?

నాగార్జున నటించిన లేటెస్ట్ చిత్రం రాజుగారి గది 2 షూటింగ్ కంప్లీట్ చేసేసుకుంది... ఇక విడుదలే చెయ్యడమే ఆలస్యం అంటూ ఆమధ్యన వార్తలొచ్చాయి. ఓంకార్ డైరెక్షన్ లో నాగార్జున కీ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రంలో సీరత్ కపూర్ హీరోయిన్ గా....సమంత ఒక ముఖ్య పాత్రలో కనిపించనుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని ముందుగా వచ్చే ఆగస్టులో విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆగష్టు లో ఈ చిత్రం విడుదల కావడంలేదని అక్టోబర్ కి షిఫ్ట్ అయినట్లు అంటున్నారు.
ఈ చిత్రం వాయిదా పడడానికి కారణం గ్రాఫిక్ వర్క్ లో జరిగిన జాప్యం వల్లనే అంటున్నారు. ఇప్పుడు గ్రాఫిక్ వర్క్ తో జాప్యం జరుగుతున్నప్పటికీ..... ఇంతకుముందే షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం కొన్ని సీన్స్ రీ షూట్స్ వలన కూడా బాగానే డిలే అయ్యిందని అంటున్నారు. కానీ సినిమా జాప్యం అవడానికి కారణం మాత్రం గ్రాఫిక్ వర్క్ అని చెబుతున్నారు.
నాగార్జున చెప్పినట్టు కొన్ని సీన్స్ ని రీ షూట్ చేసిన డైరెక్టర్ ఓంకార్... ఇప్పుడు కూడా నాగ్ సూచనతోనే కథ ప్రకారం సినిమాలో గ్రాఫిక్స్ నిడివి పెంచితే బాగుంటుందని భావించ బట్టే సినిమా విడుదల కాస్త ఆలస్యం అవుతుందని చెబుతున్నారు. ఈ లెక్కన నాగ్ సినిమాలో బాగా ఇన్వాల్వ్ అయినట్టే కనిపిస్తుంది కదూ...!.

