అంతా ఆయనే -మహేష్

సినీ ఇండస్ట్రీ లో జూనియర్ ఆర్టిస్ట్ నుండి హీరో దాక అందరికి మేకప్ ఉంటేనే కెమెరా ముందుకు వెళ్తారు. మేకప్ మెన్ కి వున్న ప్రిఫెరెన్స్ గురించి చెప్పాలంటే.. ప్రతి షాట్ కు హీరో పక్కన లేదా హీరోయిన్ పక్కనే వుంటారు. షాట్ గ్యాప్ లో వచ్చి టచ్ అప్ చేసి వెళ్ళిపోతారు. ఆలా హీరో కానీ.. హీరోయిన్ కానీ ఎన్ని రోజులు షూటింగ్ లో ఉంటే అన్ని రోజులు వారి పక్కనే ఉండాలి. వీరు లేనిదే ఆ ఆర్టిస్ట్ కెమెరా ముందుకు కూడా వెళ్లరు.
అలానే మహేష్ బాబుతో 24 ఏళ్లుగా వర్క్ చేస్తున్న మేకప్ మెన్ గురించి ఇన్స్టాగ్రామ్ లో అతని ఫోటో పోస్ట్ చేసాడు. అతని పేరు పట్టాభి. మేకప్ మెన్ గా ఎన్నో ఏళ్లు సూపర్ స్టార్ మహేష్ సినిమాలతో పాటు కొనసాగుతున్నాడు.మహేష్ చేసిన ప్రతి సినిమాకు అతనే మేకప్ మెన్. ఇతను టచ్ అప్ చేయనిదే కెమెరా ముందుకు వెళ్ళను అని పోస్ట్ చేసాడు మహేష్. అయితే ఈ ఫోటోలో మహేష్ తో పాటు అతని మేకప్ మెన్ పట్టాభి, అలానే సూపర్ స్టార్ కృష్ణ కూడా వున్నారు.
"ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ తో పోజింగ్..అతను నాతోనే గత 24 ఏళ్లుగా కొనసాగుతున్నాడు. అతను లేకుంటే కెమెరాను ఫేస్ చేయలేను. నో ఫొటోషాప్..మై ఫెవేరేట్ కలర్..మై మాన్ ఇన్ బ్లూ - పట్టాభి" అంటూ మహేష్ పోస్ట్ చేసాడు.

