Mon Feb 02 2026 03:21:08 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : హీరో రాజ్ తరుణ్ పై పోలీసులకు ఫిర్యాదు
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సినీ హీరో రాజ్్తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది

తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ సినీ హీరో రాజ్్తరుణ్ పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేసింది. నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది. తనతో కొన్నేళ్లుగా సహజీవనం చేసిన రాజ్ తరుణ్ తర్వాత వేరే హీరోయిన్ వెంట తిరుగుతూ తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తనను రాజ్ తరుణ్ గుళ్లో పెళ్లి చేసుకున్నాడని, దానికి సంబంధించి ఫొటోలను కూడా పోలీసులకు ఇచ్చింది.
ఫొటోలను బయటపెట్టి...
మూడు నెలల నుంచి తనను దూరం పెట్టారని, సినీ హీరోయిన్ తో సంబంధాలు పెట్టుకుని తనను నిర్లక్ష్యం చేశాడని, తనను హత్యచేస్తామని వాళ్లు బెదిరించారని కూడా ఆమె ఫిర్యాదులో తెలిపారు. గతంలో లావణ్య డ్రగ్స్ కేసులో పట్టుబడింది. అయితే తనను డ్రగ్స్ కేసులో ఇరికించింది కూడా రాజ్ తరుణ్ అని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు దీనిపై విచారణ చేస్తున్నారు.
Next Story

