Wed Mar 18 2026 02:55:44 GMT+0530 (India Standard Time)
హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ..

హైదరాబాద్ : టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇంట తీవ్రవిషాదం నెలకొంది. నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. తండ్రి మృతితో నిఖిల్హీ, అతని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
నిఖిల్ హీరోగా నిలదొక్కుకునేందుకు శ్యామ్ సిద్ధార్థ్ ఎంతో కృషి చేశారు. తన భవిష్యత్ కోసం ఎంతో కష్టపడిన తండ్రిని నిఖిల్ ఓ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు పరిచయం చేశాడు. నిఖిల్ తండ్రి మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు ఆవేదన చెందుతున్నారు. ఆయన మృతికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Next Story

