Tue Mar 10 2026 13:25:01 GMT+0530 (India Standard Time)
టాలీవుడ్ యువ నటుడు హఠాన్మరణం
తాజాగా టాలీవుడ్ కు చెందిన యువనటుడు గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందాడు. ‘పెళ్లిచూపులు’ , ‘ఈ నగరానికి ఏమైంది..

మృత్యువు ఎవరిని, ఎప్పుడు, ఎలా కబళిస్తుందో తెలియదు. ఇటీవల చిన్న, పెద్ద తేడాలేకుండా చాలా మంది గుండెపోటుతో హఠాన్మరణం చెందుతున్నారు. తాజాగా టాలీవుడ్ కు చెందిన యువనటుడు గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందాడు. ‘పెళ్లిచూపులు’ , ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాల దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసిన లేటెస్ట్ మూవీ కీడా కోలా. రెండు రోజులక్రితమే సినిమా టీజర్ ను విడుదల చేశారు. సినిమా విడుదలవకుండానే చిత్రయూనిట్ లో విషాద ఘటన జరిగింది.
సినిమాలో కీలక పాత్రలో నటించిన హరికాంత్ (33) గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. ఈ విషయాన్ని వంశీకాకా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. థియేటర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరికాంత్ సినిమాల్లో నటిస్తూ ఇప్పుడిప్పుడే గుర్తింపు దక్కించుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం నిర్వహించిన టీజర్ రిలీజ్ ఈవెంట్ లోనూ హరికాంత్ యాక్టివ్ గా కనిపించాడు. యువనటుడి ఆకస్మిక మృతిపట్ల చిత్రబృందం, పలువురు నటీనటులు సంతాపం తెలుపుతున్నారు.
Next Story

