Sun Mar 15 2026 19:46:28 GMT+0530 (India Standard Time)
నేను విన్నాను... నేను ఉన్నాను..

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘యాత్ర’ సినిమా టీజర్ ఇవాళ విడుదలైంది. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి రాఘవ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మళాయళ అగ్రనటుడు మమ్ముట్టి వైఎస్ పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో టీజర్ కనిపిస్తోంది. వైఎస్ పాదయాత్రకు ముందు రైతులు ఎదుర్కొన్న సమస్యలు హైలెట్ చేసినట్లు కనిపిస్తోంది. రైతులకు ‘నేను విన్నాను... నేను ఉన్నాను’ అంటూ భరోసానిచ్చే సీన్ వైఎస్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. తెలుగుతో పాటు తమిళం, మళయాళం టీజర్లను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 8న విడుదల కానుంది.
Next Story

