Mon Feb 02 2026 07:40:45 GMT+0000 (Coordinated Universal Time)
సిరివెన్నెలకు అస్వస్థత.... కిమ్స్ లో చేరిక
ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు.

ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. గత రెండు రోజులుగా సిరివెన్నెల ఆరోగ్యం బాగుండటం లేదు. ఇంటిలోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. కాని ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. సిరివెన్నెలకు అన్ని వైద్య పరీక్షలు చేసిన కిమ్స్ ఆసుపత్రి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు.
టాలీవుడ్ లో ఆందోళన....
సిరివెన్నెల ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరడంపై ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. టాలీవుడ్ లోనూ ఆయన కోలుకోవాని ప్రార్థనలు చేస్తున్నారు. ఈరోజు సిరవెన్నెల హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.
Next Story

