వావ్ మామకోడళ్లు!!
టాలీవుడ్ సినీ ఫ్యామిలి అక్కినేని నాగార్జున – సమంత ల అనుబంధం అందరికి తెలిసిందే. చైతు ని పెళ్లి చేసుకుని అక్కినేని ఫ్యామిలోకి వెళ్ళాక నాగ చైతన్య [more]
టాలీవుడ్ సినీ ఫ్యామిలి అక్కినేని నాగార్జున – సమంత ల అనుబంధం అందరికి తెలిసిందే. చైతు ని పెళ్లి చేసుకుని అక్కినేని ఫ్యామిలోకి వెళ్ళాక నాగ చైతన్య [more]
టాలీవుడ్ సినీ ఫ్యామిలి అక్కినేని నాగార్జున – సమంత ల అనుబంధం అందరికి తెలిసిందే. చైతు ని పెళ్లి చేసుకుని అక్కినేని ఫ్యామిలోకి వెళ్ళాక నాగ చైతన్య – సమంత వేరుగా ఉంటున్నప్పటికీ…. అమల, నాగ్ లతో మంచి రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తుంది సమంత. తాజాగా కరోనా లాక్ డౌన్ లో ఇంట్లోనే కూరగాయలు పండిస్తూ యోగాలు, వర్కౌట్స్ తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న సమంత తాజాగా మామగారు నాగార్జున తో కలిసి మొక్కలు నాటింది. నాగార్జున కూడా షూటింగ్స్ కోసం ప్రభుత్వ అనుమతులు వచ్చేవరకు చిరు తో కలిసి నడిచాడు. ప్రభుత్వం షూటింగ్ అనుమతులు వచ్చాక నాగార్జున మీడియాకి దూరంగానే ఉంటున్నాడు. అయితే తాజాగా మామకోడళ్లు కలిసి మొక్కలు నాటుతూ ఫొటోలకి ఫోజులిచ్చారు.
ఆ పిక్ చూసిన వారు వావ్ మామకోడళ్లు భలే మంచి పని చేస్తున్నారుగా అంటున్నారు. సమంత చక్కటి చిరునవ్వుతో… నాగార్జున కూడా నవ్వుతూ.. మొక్కని నాటుతున్న ఫోటో నెటిజెన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. కోడలు సమంత – నాగార్జున ఈ రోజు జూబీలీహిల్స్ లోని తన నివాసంలో కలిసి మూడు మొక్కలు నాటారు. ఇప్పుడు టాలీవుడ్ లో అందరూ గ్రీన్ ఛాలెంజ్ అంటూ హడావిడి చేస్తున్నారు. మరి నాగ్ ని సమంత ని ఎవరు నామినేట్ చేసారో కానీ.. నాగార్జున – సమంత కలిసి మొక్కలు అంటారు.. మరి మామకోడళ్ళ మంచి పని చూసిన అందరూ అది ఆదర్శంగా తీసుకుంటే బావుంటుంది అంటున్నారు.