Sat Mar 07 2026 11:10:25 GMT+0530 (India Standard Time)
గీతా ఆర్ట్స్ ఎదుట మహిళా ఆర్టిస్టు అర్థనగ్న ధర్నా
గీతా ఆర్ట్స్ సంస్థ తనతో పనిచేయించుకుని డబ్బులివ్వలేదని, తనకు రావాల్సిన పేమెంట్ ను న్యాయంగా ఇవ్వాలని..

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట ఒక మహిళా ఆర్టిస్టు అర్థనగ్న ధర్నా చేస్తోంది. గీతా ఆర్ట్స్ సంస్థ తనతో పనిచేయించుకుని డబ్బులివ్వలేదని, తనకు రావాల్సిన పేమెంట్ ను న్యాయంగా ఇవ్వాలని ఆ మహిళ ధర్నా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆమె పేరు సునీత బోయపల్లి. గతంలోనూ సునీత పలుమార్లు ఫిలింఛాంబర్, గీతా ఆర్ట్స్ కార్యాలయాల ఎదుట ఇలాగే ఆందోళన చేసింది. గీతా ఆర్ట్స్ ముందు మహిళ ధర్నా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న జూబ్లిహిల్స్ పోలీసులు.. ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా.. గతంలో నిర్మాత బన్నీ వాసును వేధించిన సంఘటనలో కేసు నమోదైంది.
Next Story

