Sun Nov 10 2024 09:32:08 GMT+0000 (Coordinated Universal Time)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ : సోషల్ మీడియా టాక్ ఇదే!!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ విజేత, రన్నరప్ ల వివరాలు బయటకు వచ్చాయి
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఫైనల్ విజేత, రన్నరప్ ల వివరాలు బయటకు వచ్చాయి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించారు. శివాజీ బిగ్ బాస్ హౌస్ నుండి టాప్ 3 నుండి ఎలిమినేట్ అయ్యారని ఇప్పటికే అప్డేట్స్ రాగా.. బిగ్ బాస్ తెలుగు 7 ఫైనల్ విజేత, రన్నరప్ వివరాలు బయటకు వచ్చాయి. బిగ్ బాస్ హౌస్ నుండి నలుగురు కంటెస్టెంట్లు అధికారికంగా ఎలిమినేట్ అయ్యారు. అర్జున్ అంబటి, ప్రియాంక జైన్ ఆరు, ఐదు స్థానాల్లో నిష్క్రమించారు. ప్రిన్స్ యావార్ 15L నగదును ఎంచుకున్నాడు. నాల్గవ స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత శివాజీ మూడవ స్థానంలో నిలిచాడని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఒకానొక సమయంలో శివాజీ ఖచ్చితంగా విజేత అవుతాడని భావించారు, కానీ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా మూడవ స్థానం దక్కించుకున్నాడు. ఇటీవలి వారాలలో శివాజీకి పెద్దగా ప్లస్ అవ్వలేదని తెలుస్తోంది. విజేత, రన్నర్ రేసులో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి మధ్య సాగింది. బజ్ ప్రకారం, పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడని.. అమర్దీప్ చౌదరి రన్నర్‌గా నిలిచాడని చెబుతున్నారు. ఈ సమాచారం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ ఫినాలే మా టీవీలో టెలీకాస్ట్ అవ్వనుంది. మహేష్ బాబు గెస్ట్ గా వచ్చారు.
Next Story