నాగ్ కోరుకున్నది ఇదేనా?
నాగార్జున రీసెంట్ మూవీ వైల్డ్ డాగ్ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన్మధుడు 2, ఆఫీసర్ లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత నాగ్ వైల్డ్ డాగ్ [more]
నాగార్జున రీసెంట్ మూవీ వైల్డ్ డాగ్ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన్మధుడు 2, ఆఫీసర్ లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత నాగ్ వైల్డ్ డాగ్ [more]
నాగార్జున రీసెంట్ మూవీ వైల్డ్ డాగ్ గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మన్మధుడు 2, ఆఫీసర్ లాంటి భారీ డిజాస్టర్స్ తర్వాత నాగ్ వైల్డ్ డాగ్ ని భారీగా ప్రమోట్ చేస్తూ థియేటర్స్ లో రిలీజ్ చేసాడు. లాక్ డౌన్ వలన ముందు వైల్డ్ డాగ్ ని ఆన్ లైన్ లో విడుదల చేద్దామని అనుకున్నా.. ఉప్పెన, క్రాక్ లాంటి సినిమాలు థియేటర్స్ లో దూసుకుపోవడంతో మనసు మార్చుకుని వైల్డ్ డాగ్ ని థియేటర్స్ లోనే రిలీజ్ చేసాడు నాగ్. అయితే ఎన్నడూ లేని విధంగా వైల్డ్ డాగ్ ని ప్రమోట్ చేసాడు నాగ్. సినిమా రిలీజ్ కి నెల రోజుల ముందు నుండే వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారు. ఈ సినిమా మీద నాగ్ చాలా నమ్మకమే పెట్టుకున్నాడు.
అయితే నాగ్ నమ్మకాన్ని వైల్డ్ డాగ్ నిలబెట్టిందా? అంటే వైల్డ్ డాగ్ ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ చూస్తే ఏమంత గొప్పగా లేదనే చెప్పాలి. ఏపీ, టీఎస్ లలో వైల్డ్ డాగ్ మొదటి రోజు కేవలం 1.16 కోట్లు మాత్రమే తెచ్చుకుంది. మరి నాగ్ ప్రమోషన్స్ వలనే ఈ మాత్రం ఓపెనింగ్స్ అయినా వచ్చాయి. లేదంటే అది కూడా కష్టమే అనే మాట వినిపిస్తుంది. మరో పక్క కార్తీ సుల్తాన్ కి కూడా ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇవ్వలేదు. క్రిటిక్స్ నుండి సుల్తాన్ కి సో సో టాక్ రావడంతో వైల్డ్ డాగ్ కి కొంతలో కొంత హెల్ప్ అయ్యింది. అయితే నాగ్ అనుకున్న హిట్ అయితే వైల్డ్ డాగ్ ఇవ్వలేదనే చెప్పాలి.