బండ్ల ప్లాన్ ఏమిటి చెప్మా..!
టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్ గా పలు సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు బండ్ల గణేష్.. తర్వాత నిర్మాతగా మారి స్టార్ హీరోల సినిమాలను నిర్మించి బడా [more]
టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్ గా పలు సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు బండ్ల గణేష్.. తర్వాత నిర్మాతగా మారి స్టార్ హీరోల సినిమాలను నిర్మించి బడా [more]
టాలీవుడ్ లో ఒకప్పుడు కమెడియన్ గా పలు సినిమాల్లో క్రేజ్ తెచ్చుకున్న నటుడు బండ్ల గణేష్.. తర్వాత నిర్మాతగా మారి స్టార్ హీరోల సినిమాలను నిర్మించి బడా నిర్మాతగా మారాడు. కానీ కొన్నాళ్లుగా సినిమాల్లో నటించడం కానీ, సినిమాలను నిర్మించడం కానీ చెయ్యకుండా కామ్ గా ఉన్న బండ్ల గణేష్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ తో కమెడియన్ గా రీ ఎంట్రీ ఇవ్వడమే కాదు.. మళ్ళీ సినిమాలు నిర్మించడానికి తయారయ్యాడు. అప్పటినుండి పవన్ వెనకాలే పడుతున్నాడు. పవన్ నా దేవుడు అంటూ చెప్పుకునే బండ్ల గణేష్ తాజాగా న్యూ ఇయర్ రోజున మెగా హీరోల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నాడు. క్రిస్మస్ కి పవన్ కళ్యాణ్ నుండి బండ్ల గణేష్ క్రిస్మస్ కానుకలు అందుకున్నాడు.
కానీ ఇప్పుడు న్యూ ఇయర్ రోజున బండ్ల గణేష్ మెగా హీరోల ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఇంట్లోనే కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బండ్ల గణేష్ పనిలో పనిగా తనకి ఆరాధ్య దైవం, తన దేవుడు పవన్ కళ్యాణ్ దగ్గర వాలిపోయి పవన్ కి బొకే ఇచ్చి మరీ న్యూ ఇయర్ విషెస్ చెప్పొచ్చాడు. అక్కడితో ఆగాడా.. లేదు.. మెగా మేనల్లుళ్లు సాయి ధరమ్ తేజ్ దగ్గరకి అలాగే ఆయన తమ్ముడు వైష్ణవ తేజ్ లని కలిసి బండ్ల గణేష్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. బండ్ల గణేష్ ఇలా మెగా హీరోల చుట్టూ ప్రదక్షణలు చెయ్యడం వెనుక సినీ కారణాలు అంటే.. మెగా హీరోల సినిమాల్లో కమెడియన్ గా అయినా అవకాశాలొస్తాయనే ఆలోచనా.. లేదంటే పవన్ సినిమాలను నిర్మిస్తా అన్నట్టుగానే చిరు, మెగా మేనల్లుళ్లు సినిమాలేమన్నా నిర్మించడానికి రెడీ అవుతున్నాడా అనేది బండ్లకే తెలియాలి.