క్రాక్ విషయంలో ఏదో జరుగుతుంది!
ప్రస్తుతం థియేటర్స్ లో కొత్త సినిమాల హడావిడి కనబడుతుంది. సాయి ధరమ్ తేజ్ ధైర్యం చేసాడు సక్సెస్ అయ్యాడు. సోలో బ్రతుకే సో బెటరుతో సోలోగా థియేటర్స్ [more]
ప్రస్తుతం థియేటర్స్ లో కొత్త సినిమాల హడావిడి కనబడుతుంది. సాయి ధరమ్ తేజ్ ధైర్యం చేసాడు సక్సెస్ అయ్యాడు. సోలో బ్రతుకే సో బెటరుతో సోలోగా థియేటర్స్ [more]
ప్రస్తుతం థియేటర్స్ లో కొత్త సినిమాల హడావిడి కనబడుతుంది. సాయి ధరమ్ తేజ్ ధైర్యం చేసాడు సక్సెస్ అయ్యాడు. సోలో బ్రతుకే సో బెటరుతో సోలోగా థియేటర్స్ లో దున్నేస్తున్నాడు. ఇక సాయి తేజ్ ని చూసిన హీరోలందరూ సంక్రాంతికి తమ సినిమాల డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు. రామ్ రెడ్ సినిమాని జనవరి 14 అంటూ అనౌన్స్ చేసాడు. ఇక తాజాగా ఎటువంటి హడావిడి లేకుండా బెల్లంకొండ శ్రీనివాస్ కూడా జనవరి 15 న అల్లుడు అదుర్స్ ని లైన్ లోకి తీసుకొచ్చాడు. ఇక తమిళనాట భారీగా తెరకెక్కిన మాస్టర్ సినిమా కూడా పొంగల్ రేస్ లోనే ఉంది. మరి వీటితో పాటుగా రవితేజ క్రాక్ సినిమా కూడా సంక్రాతి రేస్ లోనే ఉండబోతుంది అని.. ఎప్పటినుండో హడావిడి చేసున్నారు.
సోషల్ మీడియాలో క్రాక్ సాంగ్స్ వదులుతూ మాస్ సినిమాగా క్రాక్ ని ప్రమోట్ చేస్తున్నారు. గోపీచంద్ మలినేని – రవితేజ కాంబోలో రాబోతున్న క్రాక్ సినిమా సంక్రాంతికే అని ఫిక్స్ అయ్యారు కానీ.. డేట్ ఇవ్వలేదు. ఇప్పటికే శృతి హాసన్ తో రవితేజ రొమాంటిక్ సన్నివేశాల ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయితే క్రాక్ సినిమాని సంక్రాంతికే విడుదల అంటూ అనౌన్స్ చేసినా డేట్ విషయంలో క్లారిటీ లేకపోయేసరికి రామ్ రెడ్, అల్లుడు అదుర్స్, విజయ్ మాస్టర్ తో పోటీ పడి కలెక్షన్స్ షేర్ చేసుకునే కన్నా జనవరి 12 న కానీ, లేదంటే జనవరి చివరి వారంలో కానీ దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో రవితేజ బ్యాచ్ ఉన్నారట. మరోపక్క జనవరి 15 డేట్ పరిశీలనలో కూడా ఉన్నారనే టాక్ వినబడుతుంది. ప్రస్తుతం ఉన్నపసరిస్థితుల్లో హీరోలెవరూ కలెక్షన్స్ షేర్ చేసుకోవడానికి రెడీ అవ్వడం లేదు. సో రవితేజ వెనక్కి తగ్గినా తగ్గొచ్చనే టాక్ నడుస్తుంది.