యాక్షన్ ప్లాన్ కావాలట!!
నిన్నగాక మొన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ వెబ్ సైట్స్ పై యుద్దానికి సై అన్నాడు. వెబ్ మీడియా వలన తామెంతగా నలిగిపోతున్నామో వీడియో రూపంలో చెప్పేసరికి [more]
నిన్నగాక మొన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ వెబ్ సైట్స్ పై యుద్దానికి సై అన్నాడు. వెబ్ మీడియా వలన తామెంతగా నలిగిపోతున్నామో వీడియో రూపంలో చెప్పేసరికి [more]
నిన్నగాక మొన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ వెబ్ సైట్స్ పై యుద్దానికి సై అన్నాడు. వెబ్ మీడియా వలన తామెంతగా నలిగిపోతున్నామో వీడియో రూపంలో చెప్పేసరికి విజయ్ వెనకాల టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కదిలింది. చిరంజీవి దగ్గర నుండి, మహేష్ బాబు వరకు, దర్శకులు, చిన్న పెద్ద అందరూ విజయ్ దేవరకొండ కి మద్దతు ప్రకటించారు. చిరు తన ఫ్యామిలీ ని సైతం వెబ్ మీడియా లో పలు చెత్త రాతలు బాధపెట్టాయంటే.. నా ఫ్యామిలీని ఈ పేస్ న్యూస్ లనుండి కాపాడుకోవాలని మహేష్ డిసైడ్ అయినట్లుగా చెప్పాడు.
అయితే నాగార్జున కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ లు రాస్తే భరించాల్సిన అవసరం లేదని… విజయ్ దేవరకొండ కి అందరూ కలిసి అండగా ఉంటె సరిపోదని… వెబ్ మీడియా పై ఓ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తే బావుంటుంది అంటూ.. చిరు కి సూచించాడు. ఇలాంటి ఫేక్ న్యూస్ లను ఎదుర్కోవడానికి యాక్షన్ ప్లాన్ కావాలంటున్నాడు నాగార్జున. చాలామంది హీరోలు యెలాంటి రాతలకు సైలెంట్ అయినప్పటికీ… ఇప్పుడు విజయ్ దేవరకొండ బయటికి రాగానే.. అందరూ నెమ్మదిగా గళమెత్తుతున్నారు.