Fri Dec 05 2025 16:21:06 GMT+0000 (Coordinated Universal Time)
విరాటపర్వం ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడు-దేనిలో..?
సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు.

ఈ నెలలో థియేటర్లలో సందడి చేసిన పలు సినిమాలు ఓటీటీలో విడుదలవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నాయి.సాయి పల్లవి, రానా దగ్గుబాటి జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం విరాటపర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహించాడు. జూన్ 17న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఓటీటీలో విడుదల కాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విరాటపర్వం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం భాషలలో జూలై 1న స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, ఎల్ఎస్వీ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించారు. ఈశ్వరీ, నివేదా పేతురాజ్, ప్రియమణి, నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు.
కమలహాసన్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన విక్రమ్ సినిమా కూడా ఓటీటీలో విడుదల కాబోతోంది. జులై 8వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్రకటించింది. విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాలో విలక్షణమైన పాత్రలను పోషించగా.. ఆఖర్లో సూర్య గెస్ట్ రోల్ కారణంగా ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉందనే హింట్స్ ఇచ్చింది.
Next Story

