Fri Dec 05 2025 17:33:53 GMT+0000 (Coordinated Universal Time)
వికారాబాద్ లో భీమ్లానాయక్ షూటింగ్.. ఎగబడిన అభిమానులు
వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ - డేనియల్ శేఖర్ ల మధ్య హోరాహోరి పోరును షూట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో మల్టీస్టారర్ గా వస్తోన్న సినిమా భీమ్లా నాయక్. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పన్ కోషియమ్ సినిమాకి తెలుగులో రీమేక్ గా తీస్తున్న ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. కానీ.. ఇంకా షూటింగ్ పూర్తికాలేదు. లాస్ట్ షెడ్యూల్ షూట్ ఇంకా మిగిలి ఉండటంతో.. ఆ షెడ్యూల్ వికారాబాద్ లో ప్రారంభమైంది. వికారాబాద్ అడవుల్లో భీమ్లానాయక్ - డేనియల్ శేఖర్ ల మధ్య హోరాహోరి పోరును షూట్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు పవన్ ను చూసేందుకు తండోపతండాలుగా వచ్చారు. కొంతమంది పవన్ తో ఫొటోలు దిగేందుకు ట్రై చేయగా.. వారిని కంట్రోల్ చేసేందుకు సెట్ సిబ్బంది నానా తంటాలు పడ్డారు.
జనవరి 12వ తేదీన
చంద్రసాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్, రానా సరసన సంయుక్త మీనన్ లు నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా.. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. భీమ్లా నాయక్ నుంచి విడుదల అయిన గ్లిమ్ప్స్, రానా టీజర్ ఆకట్టుకుంటున్నాయి. జనవరి 12వ తేదీన సినిమా విడుదల కానుండగా.. ట్రైలర్ ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Next Story

