పుష్ప కి హ్యాండ్ ఇచ్చిన హీరో..!
సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోయే పుష్ప సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. జనవరిలోనే సుకుమార్ పుష్ప సినిమా కి [more]
సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోయే పుష్ప సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. జనవరిలోనే సుకుమార్ పుష్ప సినిమా కి [more]
సుకుమార్ – అల్లు అర్జున్ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కబోయే పుష్ప సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. జనవరిలోనే సుకుమార్ పుష్ప సినిమా కి సంబందించిన ట్రయిల్ షూట్ చేసాడు. ఒరిజినల్ షూట్ మార్చ్ నుండి పట్టాలెక్కాల్సి ఉంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరక్కబోయే ఈ సినిమాలో నటీనటుల ఎంపిక పూర్తయినా.. మూవీ యూనిట్ మాత్రం ఇంకా రివీల్ చెయ్యలేదు. కేవలం హీరో హీరోయిన్స్ పేర్లు తప్ప.
అయితే బన్నీ – సుక్కు సినిమాలో తమిళ నటుడు విజయ్ సేతుపతి ఓ కీ రోల్ చేస్తున్నాడని.. అది కూడా నెగెటివ్ షేడ్స్ వున్న రోల్ అన్నారు. మళ్ళీ విజయ్ కీలక పాత్ర మాత్రమే కానీ.. విలన్ రోల్ కాదని జస్ట్ కమిషనర్ పాత్రలో విజయ్ సేతుపతి పుష్ప లో కనిపిస్తాడని అన్నారు. అయితే సినిమా షూటింగ్ ఆలస్యమవడం, కరోనా కారణంగా లక్డౌన్ నడుస్తుండడంతో.. విజయ్ సేతుపతి పుష్ప సినిమాలో చేయలేనని చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం తమిళ, బాలీవుడ్ లలో సినిమాల్తో బిజీగా ఉన్న విజయ్ సేతుపతి లాక్ డౌన్ ముగియగానే ముందు ఒప్పుకున్న సినిమాలకు డేట్స్అడ్జెస్ట్ చేసుకోవాలని అందుకే పుష్ప సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పినట్లుగా తెలుస్తుంది. పుష్ప సినిమా కోసం తమిళనాట రెండు సినిమాలు వదులుకోవాల్సి వస్తుంది అని అందుకే పుష్ప ని విజయ్ సేతుపతి వదులుకున్నాడనే టాక్ నడుస్తుంది.