Fri Jan 30 2026 20:54:36 GMT+0000 (Coordinated Universal Time)
రాజకీయాలపై మనస్సు పడ్డ అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి సినిమాతో యువతకు అభిమాన హీరోగా మారిపోయిన విజయ్ దేవరకొండ మళ్లీ విద్యార్థిగా మనముందుకు రాబోతున్నాడు. అయితే, ఈసారి మరింత మాస్ గా, స్టూడెంట్ లీడర్ గా మారిపోతున్నాడు. విజయ్ తన తర్వాతి చిత్రం డియర్ కామ్రేడ్ లో విద్యార్థి నేతగా నటిస్తున్నారు. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నాది క్రికెటర్ పాత్ర అంటా. ఇందుకోసం ఆమె క్రికెట్ లో శిక్షణ కూడా తీసుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇప్పటికే విజయ్ నటించిన ట్యాక్సీవాలా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, విజయ్ మనస్సు ఎందుకో రాజకీయాలకు దగ్గరగా ఉన్నట్లుంది. ఆయన రాజకీయ నేపథ్యంతో సాగే ‘నోటా’ తమిళ సినిమాలో కూడా నటిస్తున్నారు. ఇప్పుడు విద్యార్థి నేతగా నటించనున్నారు. వరుసగా రాజకీయాల నేపథ్యంలో సాగే కథలను విజయ్ ఎంచుకుంటున్నారు.
Next Story

