Fri Dec 05 2025 12:25:20 GMT+0000 (Coordinated Universal Time)
Vijay - Rashmika : రష్మికని చూస్తుంటే గర్వంగా ఉందంటున్న విజయ్..
రష్మికని చూస్తుంటే చాలా గర్వంగా ఉందంటున్న విజయ్ దేవరకొండ. ఎందుకో తెలుసా..?

Vijay Deverakonda - Rashmika Mandanna : విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పేర్లు టాలీవుడ్ లో వారానికి ఒకసారైనా ట్రెండ్ అవ్వాల్సిందే. వీరిద్దరి మధ్య ఉన్నదీ స్నేహమో..? ప్రేమో..? తెలియదు గానీ, వీరిద్దరూ ఒకరి గురించి ఒకరు చేసే కామెంట్స్ మాత్రం.. అనేక కథనాలకు దారి తీస్తుంటాయి. తాజాగా విజయ్.. రష్మికని చూస్తుంటే గర్వంగా ఉందంటూ పోస్టు వేశారు.
ఇండియాలోని పలు రంగాల్లో సత్తా చాటుతున్న కొందరు యంగ్ టాలెంట్ పై వరల్డ్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా.. ఓ ఆర్టికల్ ని రాసుకొచ్చింది. ఇక ఈ ఆర్టికల్లో ఫిలిం ఇండస్ట్రీ నుంచి రష్మిక కనిపించారు. ఈ అరుదైన గౌరవం అందుకున్న రష్మిక తన ఆనందాన్ని తెలియజేస్తూ.. ఆ ఆర్టికల్ కవర్ పేజీని ఇన్స్టాలో షేర్ చేసారు. ఇక ఆ పోస్టు చూసిన అభిమానులు ఆమెకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈక్రమంలోనే విజయ్ దేవరకొండ సైతం రష్మికని అభినందిస్తూ పోస్టు వేశారు. రష్మిక పోస్టుని తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. "నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. ఎవరికి తెలియని స్థాయి నుంచి నేడు ఇక్కడి వరకు చేరుకున్నావు. భవిషత్తులో మరింత స్థాయికి ఎదగాలని, అలాగే ప్రతిఒక్కరికి ఇలాగే స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నాను" అంటూ విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. విజయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్, రష్మిక ఫ్యాన్స్ అయితే ఈ పోస్టు చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
Next Story

