Mon Dec 15 2025 08:26:57 GMT+0000 (Coordinated Universal Time)
అభిమానులతో చర్చలు జరిపిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు

టాలీవుడ్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. అయితే విజయ్ కు విజయాలు దూరమవ్వడంతో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ తర్వాత డిఫరెంట్ సబ్జెక్ట్లతో ముందుకు రావాలని అనుకుంటున్నాడు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పీరియాడికల్ క్రైమ్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ చిత్రం (#VD12) షూటింగ్ వైజాగ్లో జరుగుతోంది. టీమ్ మొత్తం 20 రోజులకు పైగా ఈ వైజాగ్ లో ఉండనున్నారు. మరో పది రోజుల పాటు షూటింగ్ చేయనున్నారు.
అయితే.. విజయ్ దేవరకొండ తన అభిమానులతో సమావేశమయ్యారు. అభిమానులతో చాలా విషయాలను ముచ్చటించాడు. మంచి సినిమాలు చేస్తానని, సినిమాల పరంగా ఇకపై నిరాశ పరచనని హామీ ఇచ్చాడు. కొత్త సినిమాలతో మళ్లీ పుంజుకోవాలని భావిస్తున్నాడు. ‘జెర్సీ’ స్టార్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న #VD12 తర్వాత.. రాహుల్ సంకృత్యాన్, రవి కోలాతో సినిమాలు చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
Next Story

