Sun Nov 10 2024 07:41:41 GMT+0000 (Coordinated Universal Time)
లైగర్ నుండి అదిరిపోయే సాంగ్ వచ్చేస్తోంది
లైగర్ సినిమా రిలీజ్ కు ఇంకా 50 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను
యంగ్ హీరో విజయ్ దేవరకొండ-పూరీజగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న 'లైగర్' మీద భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక మరో అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. 'అక్డి పక్డి' అనే పాటకు సంబంధించిన అప్డేట్ను అందించారు. ఈ సాంగ్ టీజర్‌ను జూలై 8న విడుదల కానుండగా.. ఫుల్ సాంగ్ జూలై 11న రిలీజ్ కాబోతోంది.
లైగర్ సినిమా రిలీజ్ కు ఇంకా 50 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ సినిమా ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే అక్డీ పక్డీ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను జూలై 11న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ పాట హిందీ వెర్షన్ లిరిక్స్‌ను మోహ్సిన్ షైక్, అజీమ్ దయాని అందించగా లిజియో జార్జ్ సంగీతం అందించారు. తెలుగు విషయానికొస్తే అనురాగ్ కుల్కర్నీ, రమ్య బెహరా ఆలపించారు. భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్గా నటిస్తుండగా, లెజెండరీ బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించారు. విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియా సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పోస్టర్స్, టీజర్స్ మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇక ఇటీవల ఈ సినిమా నుండి విజయ్ దేవరకొండ న్యూడ్ పోస్టర్ ఎంత రచ్చ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
News Summary - vijay devarakonda ananya pandey liger movie song
Next Story