విజయ్ బాలీవుడ్ ఎంట్రీ పక్కనా?
అర్జున్ రెడ్డి తో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కి బాలీవుడ్, తమిళ, మలయాళ, కన్నడలోను ఫ్యాన్స్ పుట్టేసారు. అర్జున్ రెడ్డి క్రేజ్ [more]
అర్జున్ రెడ్డి తో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కి బాలీవుడ్, తమిళ, మలయాళ, కన్నడలోను ఫ్యాన్స్ పుట్టేసారు. అర్జున్ రెడ్డి క్రేజ్ [more]

అర్జున్ రెడ్డి తో తిరుగులేని స్టార్ డం సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ కి బాలీవుడ్, తమిళ, మలయాళ, కన్నడలోను ఫ్యాన్స్ పుట్టేసారు. అర్జున్ రెడ్డి క్రేజ్ తోనే విజయ్ అన్ని భాషల హీరోగా మారాడు. అందుకే తన డియర్ కామ్రేడ్ ని నాలుగు భాషల్లో విడుదల చేసాడు విజయ్. కానీ హిందీ లోకి డబ్బింగ్ తో వెళ్లకుండా నేరుగా అడుగుపెట్టాలనుకుంటే డియర్ కామ్రేడ్ ఇచ్చిన షాక్ కి విజయ్ ఆలోచనలో పడ్డాడనే వార్తలొచ్చాయి. కానీ విజయ్ దేవరకొండ మాత్రం బాలీవుడ్ లో కరణ్ జోహార్ లాంటి పెద్ద పెద్ద వాళ్లతో చెలిమి చేస్తున్నాడు. అందుకే కరణ్ కూడా డియర్ కామ్రేడ్ తోనే విజయ్ ని బాలీవుడ్ ఎంట్రీ ఇప్పిద్దామనుకున్నాడు.
కానీ డియర్ కామ్రేడ్ పోవడంతో.. ఆ ఆలోచన నుండి బయటికొచ్చారు. తాజాగా విజయ్ బాలీవుడ్ ఎంట్రీ పక్కా అంటూ వార్తలొస్తున్నాయి. కొంతకాలంగా విజయ్ హిందీ ఎంట్రీ మీదొస్తున్న వార్తలు నిజం కాబోతున్నాయంటున్నారు. విజయ్ అంటే క్రేజున్న బాలీవుడ్ ప్రముఖులు కరణ్ జోహార్, సిద్దార్థ్ రాయ్ కపూర్, సాజిద్ నడియాడ్వాలా లు విజయ్ దేవరకొండని బాలీవుడ్ కి గ్రాండ్ గా ఎంట్రీ ఇప్పించబోతున్నారనే న్యూస్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కరణ్ కి ముందు నుండి విజయ్ దేవరకొండ అంటే క్రేజ్.అందుకే డియర్ కామ్రేడ్ హిందీ హక్కులు కొనేసాడు. తాజాగా డియర్ కామ్రేడ్ తోనో.. లేదంటే మరేదన్న కొత్త కథతోనో విజయ్ తో సినిమా చెయ్యాలని కరణ్ జోహార్, సిద్దార్థ్ రాయ్ కపూర్, సాజిద్ నడియాడ్వాలా ఫిక్స్ అయినట్లుగా మీడియా టాక్. ఇప్పటికే వారి కాంబోలో మూవీ లాంచ్ ఏర్పాట్లు మొదలైనట్లుగా చెబుతున్నారు.

