Tue Dec 16 2025 23:37:55 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ దూకుడు.. ఎక్కడికి వెళ్లాడంటే..!
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రమోషన్లో భాగంగా పాట్నా నగరానికి వెళ్లాడు.

సినిమా చేయడం కాదు.. సినిమా గురించి సాధారణ వ్యక్తుల వరకూ తెలియజేయడం చాలా ముఖ్యం. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా లైగర్ సినిమా ఆగష్టు 25న విడుదల కాబోతోంది. పూరీ-విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీగా విడుదల కాబోతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీగా ప్లాన్ చేసింది. ఇప్పటికే పలు టీవీ షోలలో సందడి చేస్తున్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు పలు ప్రాంతాలకు వెళ్లి మరీ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ లైగర్ సినిమా ప్రమోషన్లో భాగంగా పాట్నా నగరానికి వెళ్లాడు. పాట్నాలో 'గ్రాడ్యుయేట్ చాయ్ వాలీ'కి వెళ్ళి విజయ్ టీ తాగాడు. వాళ్ళతో కాసేపు ముచ్చటించి సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కరణ్జోహార్, చార్మీ, పూరి జగన్నాధ్ సంయుక్తంగా నిర్మించారు. ప్రముఖ బాక్సర్ మైఖ్ టైసన్ కీలకపాత్రలో నటించాడు.
థియేట్రికల్ విడుదల దిశగా 'లైగర్' దూసుకుపోతూ ఉంది. ఈ చిత్రం నుండి మూడవ సాంగ్ శనివారం విడుదలైంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఉన్న 'ఆఫట్' సాంగ్ ఆకట్టుకుంటూ ఉంది. విజయ్ మాట్లాడుతూ "'లైగర్'కి ప్రేక్షకుల నుండి వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. మరింత సపోర్ట్, ప్రేమను అందుకుంటానని ఆశిస్తున్నానన్నాడు. లైగర్' సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తీ అయిపోయాయి. ఈ సినిమాకు UA సర్టిఫికేట్ను అందించారు. సినిమా రన్టైమ్ 2 గంటల 20 నిమిషాలు, మొదటి సగం 1 గంట 15 నిమిషాలు- రెండవ సగం 1 గంట 5 నిమిషాలు ఉందని అంటున్నారు. సినిమా చూసిన తర్వాత సెన్సార్ బోర్డ్ సభ్యులు సినిమా బాగుందని మెచ్చుకున్నారని సమాచారం.
News Summary - Vijay and Ananya movie liger promotions director Puri Jagannadh
Next Story

